భావప్రకటన స్వేచ్ఛపై ఎదురుదాడి | - | Sakshi
Sakshi News home page

భావప్రకటన స్వేచ్ఛపై ఎదురుదాడి

May 11 2025 7:35 AM | Updated on May 11 2025 7:35 AM

భావప్

భావప్రకటన స్వేచ్ఛపై ఎదురుదాడి

తిరుపతి సిటీ: ‘ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. రాష్ట్రంలో అలాంటి హక్కుకు భంగం కలిగేలా ఘటనలు జరగడం ప్రమాదకరం. పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు చట్ట విరుద్ధం. ప్రభుత్వం చేసే తప్పును ఎత్తి చూపితే కేసులు, భయభ్రాంతులకు గురిచేసేలా దాడులు చేయడంలో ఆంతర్య మేమిటో అర్థంకాని పరిస్థితి. రాష్ట్రంలో కార్పొరేట్‌ సంస్థల హవా కొనసాగుతోంది. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదు. సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఉద్యోగ, ఉపాధి రంగాలపై దృష్టి లే దు’..అని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌.లక్ష్మణరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏడాదిగా సాగుతు న్న పాలనపై తన అభిప్రాయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..

బలహీన పడుతున్న విద్యావ్యవస్థ

రాష్ట్రంలో పాఠశాలలు బలహీన పడే పరిస్థితి నెలకొంది. 9 రకాల పాఠశాలల ఏర్పాటు అనే కాన్సెఫ్ట్‌తో ప్రభుత్వం నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. దీంతో వందల సంఖ్యలో పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. సుమారు 10వేల ఉపాధ్యాయ పోస్టులు సర్‌ప్లస్‌ కానున్నాయి. గత ప్రభుత్వంలో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రమోషన్లు రద్దు కానున్నాయి. కార్పొరేట్‌, ప్రైవేటు సంస్థలు విలయతాండవం చేయనున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రొత్సహించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాడు–నేడు పథకంతో గత ప్రభుత్వం పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించింది. మరికొన్ని పాఠశాలల్లో మౌలికవసతులను కల్పించాల్సి ఉంది. వాటిని పట్టించుకోవడం లేదు. 17 మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని గత ప్రభుత్వ చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వక్తుల చేతుల్లో పెట్టడం సరైన పద్ధతి కాదు.

డీఎస్సీపై ఆంక్షలు దారుణం

మెగా డీఎస్సీ పేరుతో 16 వేల పోస్టులకు పైగా విడుదల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం అందులో ఆంక్షలు విధించడం దారుణం. అభ్యర్థుల వయోపరిమితి 47కు పెంచాల్సిన అవసరం ఉంది. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు కనీసం 90 రోజులు గడువు ఇవ్వాలి. అర్హతల పేరుతో మార్కుల శాతం పరిగణనలోని తీసుకునేలా నిబంధనలు విధించారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ప్రతి జిల్లాకు వేర్వేరుగా ప్రశ్న పత్రాలు ఇవ్వాలి.

తప్పు ఎత్తిచూపే హక్కు మీడియాకుంది

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంది. భావప్రకటనా స్వేచ్ఛపై ఎదురుదాడికి దిగుతోంది. ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపే హక్కు పత్రికలకు, మీడియాకు ఉంది. అలాంటి వాటిని స్వీకరించి తప్పులను సరిదిద్దుకోవాలి. కానీ అలా జరగకపోగా మీడియా ప్రతినిధులపైన, కలం కార్మికులపైన దాడులు చేయడం దారుణం. భయపెట్టడం, కేసులు బనాయించడం దారుణం. ప్రతికా చ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధం.

పేరుకుపోయిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు

అవస్థలు పడుతున్న విద్యార్థులు

20 లక్షల ఉద్యోగాలకు జాబ్‌ క్యాలండర్‌ ఏదీ?

రాష్ట్రంలో కార్పొరేట్‌, ప్రైవేటు రంగాల హవా

సంక్షేమం గాలికి వదిలేశారు

తప్పును ఎత్తి చూపితే కేసులు, దాడులా?

‘సాక్షి’తో మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌.లక్ష్మణరావు

సంక్షేమం గాలికే

కూటమి ప్రభుత్వం అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. రైతులకు అన్నదాత సుఖీభవ, ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకాలు నిర్వీర్యమయ్యాయి. వాటి ప్రస్తావనే ఎత్తడం లేదు. పీ4, స్వరాంధ్ర 2.0 అంటూ స్వప్నలోకంలో ప్రగతి జరుగుతున్నట్లు ఉంది. రాబోయే నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్న గ్యారంటీ లేదు.

20 లక్షల ఉద్యోగాల మాటేంటో?

నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3వేలు, 20 లక్షల ఉద్యోగాలకు జాబ్‌ క్యాలెండ్‌ విడుదల హామీలు ఏమయ్యా యో. ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు పారిశ్రామిక, ఐటీ రంగాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో సుమారు 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి.

భావప్రకటన స్వేచ్ఛపై ఎదురుదాడి 1
1/1

భావప్రకటన స్వేచ్ఛపై ఎదురుదాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement