
వెకేషన్ జడ్జిగా సూర్యనారాయణమూర్తి
చిత్తూరు లీగల్: జిల్లాలోని అన్ని న్యాయస్థానాలకు వెకేషన్ జడ్జిగా మదనపల్లె రెండవ అదనపు జిల్లా జడ్జి సూర్యనారాయణమూర్తి వ్యవహరించనున్నారు. న్యాయస్థానాలకు వేసవి సెలవులు కావడంతో ఉమ్మడి జిల్లాలో ఈ నెల 20, 28 తేదీ చిత్తూరు, 15, 22 తేదీల్లో తిరుపతి, 19, 27 తేదీల్లో మదనపల్లె, 14, 21, 26 తేదీల్లో పీలేరు, 16, 23 తేదీల్లో శ్రీకాళహస్తి కోర్టులకు కేసుల విచారణ నిమిత్తం సూర్యనారాయణ మూర్తి హాజరు కానున్నారు.
20న సార్వత్రిక సమ్మె
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఐ జిల్లా కార్యదర్శులు కోదండయ్య, సురేంద్ర, నాగ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. లేబర్ కోడ్‌లను రద్దుచేసి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 12వ పీఆర్సీ అమలు చేయాలని, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కరించాలన్నారు. ఆశ, అంగన్‌వాడి, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. నాయకులు షకీలా, బా లసుబ్రమణ్యం, సతీష్, జ్యోతి, అయ్యప్ప, బాలాజీరావు, చిట్టెమ్మ పాల్గొన్నారు.