
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి సారూ!
● రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు అపస్ నేతల వినతి
చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. గురువారం విజయవాడలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలతో కమిషనర్ నిర్వహించిన స మావేశంలో ఆయన పలు సమస్యలపై చ ర్చించారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజుకు ఆ సంఘం నేత లు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షు లు బాలాజీ విలేకరులతో మాట్లాడారు. తొలుత హెడ్‌మాస్టర్ బదిలీలు, హెచ్‌ఎంల ఉద్యోగోన్నతులు, తర్వాత స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల ఉద్యోగోన్నతులు బదిలీలు ని ర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సు ముఖత చూపించారన్నారు. ఉద్యోగోన్నతు ల ప్రక్రియలో ఖాళీలను గుర్తించాక 1:2 ప్రాతిపదికన సీనియార్టీ జాబితా ప్రకటించి, అందరూ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తారన్నారు. రెండేళ్లలోపు ఉద్యోగ విరమణ పొందే వారుంటే మినహాయింపు ఇస్తారని చెప్పారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉద్యోగోన్నతులకు త్వరలో నిర్ణయం ప్రకటిస్తారన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకే ప్రాతిపదికన టీచర్లను కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ప్రధానంగా ఫౌండేషన్ స్కూళ్లలో 1:20 ప్రకారం టీచర్లను నియమించాలని డిమాండ్ చేశామన్నారు. బేసిక్ ప్రైమరీ స్కూల్స్‌లో కనీసం ఇద్దరు టీచర్లు నియమించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని కోరామన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే అదనపు సెక్షన్ కింద పరిగణించాలన్నారు. ప్రతి 30 మంది విద్యార్థులకు రెండో సెక్షన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. తెలుగు మీడియం కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయుల పనిభారం 30 పీరియడ్లకు మించకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైస్కూల్ ప్లస్ పీజీటీలకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 610 జీఓలో వివిధ జిల్లాల్లో 18 ఏళ్లుగా ఉద్యోగోన్నతులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పీడీలకు న్యాయం చేయాల ని కోరారు. పాఠశాల రోల్ మార్చి 31 నాటికి కాకుండా ఏప్రిల్ 7 వరకు తీసుకోవాలన్నారు. అంతర్ జిల్లాల బదిలీ సైతం నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.