
తమ్ముళ్ల దౌర్జన్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పూతలపట్టు నియోజకవర్గంలో పాతకక్షలకు కూటమి నేతలు పదును పెట్టారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని అధికార మదంతో పచ్చరౌడీలు పెట్రేగిపోతున్నారు. ఆందోళనలు సృష్టించి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ వింత పోకడను ప్రశ్నిస్తున్న అమాయకులైన దళితులు, మెనారిటీలపై దాడులకు తెగబడుతున్నారు. ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
రౌడీ రాజకీయమా?
ప్రశ్నించే గొంతును కూకటివేళ్లతో పెకలించాలనే దృఢ సంకల్పంతో పక్కా ప్రణాళికలతో గొడవలు సృష్టించి పచ్చని పల్లెల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే సంకల్పంతో జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా పేదవారి కన్నీళ్లు తుడుస్తూ తల్లిదండ్రులకు భారం కారాదని తల్లుల ఖాతాలకు డబ్బులు వేసేవారు. కానీ నేటి ప్రభుత్వంలో అమ్మఒడి అందక విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల, కళాశాల యాజమాన్యాల ఫీజుల చెల్లించక ఇబ్బందుల పడుతున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన ఓ ప్రైవేటు లెక్చరర్‌పై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేశారు.
సామాన్యులపై కూటమి ప్రతాపం
● ఓ నిరుపేద మైనార్టీ బాలుడు తన కుటుంబం పడుతున్న కష్టాలను చూడలేక .. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే తమ కుటుంబం ఇలా కష్టాలు పడేవా అని మదనపడ్డాడు. స్థానికంగా కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను భరించలేక 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించి అధికార సింహాసనాన్ని అధిరోహిస్తుందని..తన అభిమానాన్ని వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఇది భరించలేని పచ్చ నేతలు కాపు గాసి రాత్రి సమయంలో అదును చూసి ఆ బాలుడిని అపహరించి చిత్రహింసలకు గురిచేసి దాడి చేశారు. దీనిని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ అభిమానుల ఐదుగురిపై విచక్షణా రహితంగా కత్తులు, రాడ్లు, కరల్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.ఈ ఘటనలో ఓ యువకుడికి కంటిలో రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు.
● ఎస్సీ, ఎస్టీ కేసు విత్‌డ్రా తీసుకోలేదని పూతలపట్టు మండలం ఆకనబట్టు సర్పంచ్ మణిపై టీడీపీ నేత జయప్రకాష్ బూతులతో బెదిరించాడు. ఇంతకీ కేసు వెనక్కి తీసుకుంటావా లేదా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. మాట మాటకు ఫోన్లో కులం పేరుతో దూషిస్తూ..భయబ్రాంతులకు గురి చేశాడు. కేసు వెనక్కి తీసుకోకపోతే కుటుంబ సమేతంగా చంపేస్తానంటూ బూతులతో హెచ్చరికలు జారీ చేశాడు. ఇవీ కొన్ని మాత్రమే బయటకు కనిపించిన చాలా వరకు వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. ఇటువంటి దారుణ ఘటనలు కోకొల్లలు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న కూటమి గూండాలను కూకటివేళ్లతో పెకలించి శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించి పక్షపాతాన్ని చూపడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
వైఎస్సార్‌సీపీ నేతలపై పచ్చనేతల ఆగడాలు
అధికార మదంతో పేట్రేగుతున్న తమ్ముళ్లు
పూతలపట్టులో రెచ్చిపోతున్న కూటమి శ్రేణులు
దాడులపై న్యాయపోరాటానికి దిగుతాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా దాడులు, అరాచకాలు జరుగుతున్నాయి. కనీసం సామాన్య జనానికి సరైన న్యాయం జరగడం లేదు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కూటమి నేతలు దాడులు చేయిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. అన్నిరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రోజు అధికారం చేతిలో ఉందని ఇలా చేయడం ఎంత వరకు సమంజసం. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఒక ఎస్సీ సర్పంచ్‌ను కులం పేరుతో దూషించడంతో పాటు బూతులు తిట్టడం కరెక్టు కాదు. దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నియోజకవర్గంలో జరుగుతున్న దాడులు, అరాచకాలపై న్యాయపోరాటానికి దిగుతాం. – సునీల్‌కుమార్, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే

తమ్ముళ్ల దౌర్జన్యం

తమ్ముళ్ల దౌర్జన్యం