హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది | - | Sakshi
Sakshi News home page

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

May 24 2025 1:25 AM | Updated on May 24 2025 1:25 AM

హాకిం

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

అంజన్న అభయం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్దగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
● రాజకీయ కక్షతోనే స్టేట్‌ సిలబస్‌ అనుమతులు రద్దు ● సీబీఎస్‌ఈ అనుమతులు ఉన్నాయి ● హాకింగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ హఫీజ్‌

23 రోజులు..1000 రిజిస్ట్రేషన్లు

కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులకు వివాహ ధ్రువపత్రాలు అందజేసేందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు.

శనివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2025

10లో

ఇతని పేరు కృష్ణయ్య పాలసముద్రానికి చెందిన రైతు.. పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. ట్రాన్స్‌ కో అధికారులు బాగు చేస్తార ని రెండు వారాలుగా నిరీక్షించారు. ఫలితం లేకపోవడంతో చిత్తూరుకు స్నే హితుడి ట్రాక్టర్‌ తీసుకొని రూ.1500 డీజిల్‌ పట్టుకొని, డ్రైవర్‌కు రూ.800 కూలీ ఇచ్చి తీసుకొచ్చాడు. మధ్యాహ్నం హోటల్‌లో భోజనం చేసి సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతులు చేయించుకొని తీసుకెళ్లారు. ఆయన పొలం నుంచి రానుపోనూ 84 కిలోమీటర్లు ప్రయాణించి అగచాట్లు పడ్డాడు.

ఉమ్మడి జిల్లా విద్యుత్‌ సమాచారం

గతేడాది, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఎస్‌పీఎంల (ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం) నందు రిపేరు చేసిన వివరాలు

ఇబ్బందులు పడుతున్నాం

ఎండకాలంలో ఎక్కువగా ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతులు అవుతున్నాయి. కరెంటోళ్లకు విషయం చెబితే పెద్ద గా పట్టించుకోవడం లే దు. బతిమలాడి పనులు చేసుకోవాలి. మాట లు చెబుతున్నట్లుగా క్షేత్రస్థాయిలో పనులు కావడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేరుకు వస్తే వాటిని బాగు చేసి తీసుకురావడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు .

– గంగిరెడ్డి, రైతు చంద్రగిరి

రోలింగ్‌ స్టాక్‌ లేదంటున్నారు

ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు అయ్యే వరకు స్థానికంగా విద్యుత్‌శా ఖ కార్యాలయాల్లో రో లింగ్‌ స్టాక్‌ అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పాడైన ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేసి మార్చే వరకు రోలింగ్‌ స్టాక్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌ను రైతు వాడుకుంటారు. కానీ రోలింగ్‌ స్టాక్‌ లేదని అధికారులు అంటున్నారు. పలుకుబడి ఉన్నవారి పనులు త్వరగా చేస్తున్నారు.

– తిరుమలరెడ్డి, రైతు నగరి

1912కు ఫిర్యాదు చేయండి

వేసవిలో ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్లు ఎక్కువ గా వస్తుంటాయి. సకాలంలో వాటిని బాగు చేసి పంపాలని రైతులను ఇబ్బంది పెట్టరా దని సంబంధిత అధికారులను ఆదేశించాం. సమస్యల పై 1912కు ఫిర్యాదు చేయండి. రవాణా, మరమ్మతు, ఇతర సేవలకు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ట్రాన్స్‌ఫార్మర్ల రోలింగ్‌ స్టాక్‌ను అందుబాటులో ఉంచుతాం. – సురేంద్రనాయుడు,

ఇస్మాయిల్‌ అహ్మద్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈలు, తిరుపతి, చిత్తూరు జిల్లాలు

ఐఐటీ, నీట్‌ శిక్షణకు స్క్రీనింగ్‌ పరీక్ష

చిత్తూరు కలెక్టరేట్‌ : డా.బీఆర్‌. అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ మొదటి సంవత్సరం ఐఐటీ, నీట్‌ శిక్షణ సెంటర్‌ల ప్రవేశానికి స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ గీత తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న బాల, బాలికలు ఈనెల 25వ తేదీన నిర్వహించే రెండవ స్క్రీనింగ్‌ పరీక్షకు హాజరు కావాలన్నారు. పరీక్ష ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా కేంద్రంలోని సంజయ్‌గాంధీ నగర్‌లో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ కళాశాలలో నిర్వహిస్తార న్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆధార్‌కార్డు జిరా క్స్‌ తీసుకుని రావాలని ఆమె వెల్లడించారు.

సిజేరియన్లను తగ్గించాలి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లాలో సిజేరియన్లను తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆమె శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. మాతాశిశు మరణాల కట్టడికి అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో గర్భిణులకు సకాల ఆరోగ్య సేవలు అందేలా చూడాలన్నారు. హైరిస్క్‌ కేసులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. ప్రధానంగా సుఖ ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు సిజేరియన్ల సంఖ్య తగ్గించాలని సూచించారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్‌, డీఐఓ హనుమంతరావు, వైద్యులు అనిల్‌కుమార్‌, ప్రవీణ, అనుష, రామ్మోహన్‌, ప్రసాద్‌, శ్రీవాణి పాల్గొన్నారు.

ఎస్సీ నిరుద్యోగ యువతకు శిక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ చెన్నయ్య తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు లెదర్‌ స్టిచ్చింగ్‌ ఆపరేటర్‌, లెదర్‌ ఫుట్‌వేర్‌, లెదర్‌ కట్టర్‌ పుట్‌వేర్‌ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. శిక్షణకు ఎస్సీ కులస్థులై ఉండాలన్నారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలన్నారు. శిక్షణలో ఉచిత భోజనం, వసతి, ఉచిత కిట్లు అందజేస్తామన్నారు. 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 98493 73131, 63056 88868 నంబర్‌లలో సంప్రదించాలని కోరారు.

నెల 2024 2025

ఫిబ్రవరి 1,152 1,224 మార్చి 1,194 1,806

ఏప్రిల్‌ 1,146 1,548 మే (17వరకు) 1,242 732

మొత్తం 4,734 5,310

పాడైన ట్రాన్స్‌ఫార్మర్లు

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే అన్నదాతల అగచాట్లు అన్నీఇన్ని కావు. పొలం నుంచి సొంత డబ్బు వెచ్చించి ట్రాన్స్‌ఫార్మర్‌ను సమీప మరమ్మతుల కేంద్రానికి తీసుకెళ్లడం గగనమవుతోంది. అంత కష్టపడి అక్కడికి తీసుకెళ్లినా బేరం కుదిరితే గానీ రిపేరు చేసి ఇవ్వడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుకుబడి ఉన్న వారికే రోలింగ్‌స్టాకు అందిస్తున్నారు. సాధారణ రైతులకు అయితే రోలింగ్‌ స్టాకు లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరమ్మతుల కేంద్రంలో రైతులు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చిత్తూరు కార్పొరేషన్‌ : ఎండలు మండుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా ఇంట్లో ఫ్యాన్‌ స్పీడ్‌ 5 మీద ఉన్నా గాలి చాలడం లేదు. ఇక ఏసీ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సగటున జిల్లాలో 40–44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం బయటకెళ్లి పనులు చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేలోపు చెమటలతో దుస్తులు తడిసిపోతున్నాయి. ఎండల మంటతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో రైతన్నలు వాటిని బాగు చేసుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మరమ్మతులకు గురైన ట్రాన్స్‌ఫార్మర్లను రైతులు బాగు చేసుకోవాలంటే కష్టాలు పడుతున్నారు. సగటున నెలకు దాదాపు 1000 తక్కువ కాకుండా రిపేర్లకు గురవుతున్నాయి. ఎక్కువగా వేసవిలో ఈ కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. చిత్తూరు, పుంగనూరు, పుత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తిలో సమస్య అధికంగా ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌లు మరమ్మతులకు రైతులను వేధిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి.

అదనంగా మరమ్మతులు

ఏడాదిలో ఎక్కువగా ఫిబ్రవరి నుంచి జూన్‌ లోపు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత నెలల కంటే 30–50 శాతం అధికంగా రిపేర్లు వస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి మే నెల వరకు 4,734 ట్రాన్స్‌ఫార్మర్‌లు మరమ్మతు అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే 17 వరకు 5,310 ట్రాన్స్‌ఫార్మర్‌లు రిపేర్‌ అయ్యాయి.

జెడ్పీటీసీల ఆవేదన పట్టదా?

ఉమ్మడి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లు సకాలంలో మరమ్మతు చేయడం లేదని ఏప్రిల్‌ 29న జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు జెడ్పీటీసీ సభ్యులు నిలదీశారు. సమస్య పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ సురేంద్రనాయుడు తెలియజేశారు. మే 13న జరిగిన జెడ్పీ స్థాయి సంఘాల సమావేశాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు సకాలంలో మరమ్మతు చేయడం లేదని, అధికారులు వేధిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనలకు పాతర

ఉమ్మడి జిల్లాలో రేణిగుంట, పుత్తూరు, పీలేరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, చిత్తూరు , పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఎస్‌పీఎం(ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం) ఉన్నాయి. గ్రామీ ణ ప్రాంతాల్లో 2 రోజులు, నగర, పట్టణాల్లో రోజులో ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేసి పంపాలనే నిబంధన ఉంది. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ లోడింగ్‌, అన్‌లోడింగ్‌, రిపేర్‌కు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వ్యవసాయ సర్వీసుకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు అయితే రైతులు ట్రాక్టర్‌, టాటా ఏస్‌ వాహనాల నందు తెచ్చుకొని మరమ్మతులు చేయించుకుంటున్నారు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌, మరమ్మతు, బిగింపులకు బేరాలు చేసుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్యకర్తలకు అండగా నిలబడుతాం

కార్వేటినగరం : ౖవెఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా నిలబడుతామని అధైర్య పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గంగమాంబాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత చిన్నబ్బరెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు, నాయకులు అంకిత భావంతో కృషి చేసి సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్థానాలను కై వసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ఏడాది కాక ముందే కూటమి కోటలు బీటలు వారుతున్నాయని, శాసనసభ ఎన్నికల్లోపే టీడీపీకి జెండా పట్టే కార్యకర్తలు కరువవ్వడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పట్టాభిరెడ్డి, మురాజ్‌, రామిరెడ్డి, సతీష్‌, చందురాజు, అమీద్‌, ,శోభన్‌బాబు, ప్రేమనాధరెడ్డి, ధనంజయవర్మ, శేషాద్రి, మునిరెడ్డి, మణి (వెదురుకుప్పం పార్టీ కన్వీనర్‌), కుప్పయ్య, జనార్దన్‌ఽ, భూపతిరెడ్డి, నందగోపాల్‌ పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లలో కలెక్టర్‌, ఎస్పీ

శాంతిపురం : కడపల్లి పంచాయతీలోని శివపురం వద్ద నిర్మించిన సొంతింటి గృహ ప్రవేశానికి సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ మణికంఠ చందోలు ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకూ సీఎం కుప్పం పర్యటన సాగనుంది. దీంతో నూతనంగా నిర్మించిన ఇంటిని, ద్రవిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను సందర్శించారు. వి.కోట నుంచి కుప్పం వరకూ జాతీయ రహదారిలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించి, పారిశుద్ధ్య పనులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కొత్త ఇంటి వద్ద పార్కింగ్‌, శ్యానిటేషన్‌, బారికేడ్లు తదితర అంశాలపై మార్గదర్శకం చేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ నందకిషోర్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసరాజు, డీపీఓ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కుప్పంరూరల్‌/శాంతిపురం: రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తమ పాఠశాల అనుమతులు రద్దు చేసిందని కుప్పం హాకింగ్‌ ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ హఫీజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున చైర్మన్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా జిల్లా అధికారులు తమ పాఠశాలలో 8, 9, 10 తరగతులు రద్దు చేయడం దారుణమన్నారు. తరగతుల రద్దు విషయం సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న తరువాత శుక్రవారం హఫీజ్‌ పాఠశాలలో విలేకరులతో మాట్లాడారు. 2019లో పాఠశాల ప్రారంభించామని, మొత్తం 950 మంది విద్యార్థులు చదువుతున్నారని, 150 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. అధికారులు ఏకపక్షంగా 8, 9, 10 తరగతుల స్టేట్‌ సిలబస్‌ రద్దు చేయడం దారుణమన్నారు. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందొద్దని, స్టేట్‌ సిలబస్‌ అనుమతులు మాత్రమే రద్దు చేశారని, సీబీఎస్‌ఈ అనుమతులు ఉన్నాయని, తరగతులు యధావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో అధికారుల తీరుపై కోర్టుకు వెళ్తామని హఫీజ్‌ తెలిపారు. అనుమతుల రద్దుకు అధికారులు చెప్పిన కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో పాఠశాల డైరెక్టర్‌ షబ్బీర్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

విపక్షాన్ని అణచివేసే కుట్రే

విపక్షాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే హాకింగ్‌ స్కూల్‌ అనుమతులు రద్దు చేశారని వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్‌ విమర్శించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తాను, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు పార్టీ కూడా హఫీజ్‌కు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

– 10లో

– 10లో

న్యూస్‌రీల్‌

ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా రోజువారీ విద్యుత్‌ వినియోగం వివరాలు

తేది వాడకం

(మిలియన్‌ యూనిట్లు)

మే 10 21.20

11 21.54

12 23.13

13 25.16

14 24.95

15 23.17

16 22.63

17 21.80

ఉమ్మడి జిల్లాలో నెలకు 1000 నియంత్రికలు రిపేరు

పెరిగిన రోజువారీ విద్యుత్‌ వినియోగం

సకాలంలో పూర్తి కాని పనులు

అలసత్వం వహిస్తున్న విద్యుత్‌ అధికారులు

అలంకారప్రాయంగా ఓఆర్‌ఎం

ఎండా కాలంలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల్లో అధికంగా ఆయిల్‌ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పాత ఆయిల్‌ను శుద్ధిచేసి బాగుచేసి పంపుతున్నారు. చిత్తూరు కేంద్రంలో ప్రస్తుతం 200 లీటర్లను మాత్రమే శుద్ధి చేసే మిషన్‌ ఉంది. 2 వేల లీటర్ల ఆయిల్‌ను శుద్ధిచేసే నూతన ఓఆర్‌ఎం (ఆయిల్‌ రీజనరేషన్‌ మిషన్‌) ఇన్‌స్టాల్‌ చేయకుండా ఆరు నెలలుగా అలంకారప్రాయంగా అలానే ఉంచేశారు. అధికారుల అలసత్వంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా తయారైంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో వీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గత ప్రభుత్వ పాలనలో రూ.50 లక్షల వ్యయంతో ఓఆర్‌ఎంను మంజూరు చేశారు. డిస్కం (రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) పరిధిలో ఇటువంటి మిషన్‌ ఎక్కడా లేదు. పెండింగ్‌లో ఉన్న 10 శాతం మొత్తం ఇస్తేగానీ టెక్నీషియన్లు ఇన్‌స్టాలేషన్‌ చేయమంటున్నారు. ఆరు నెలలుగా మిషన్‌ను ఎస్‌పీఎంలో దిష్టిబొమ్మలాగా దర్శనం ఇస్తోంది. దీంతో అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు.

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది 1
1/9

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది 2
2/9

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది 3
3/9

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది 4
4/9

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది 5
5/9

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది 6
6/9

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది 7
7/9

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది 8
8/9

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది 9
9/9

హాకింగ్‌ పాఠశాల యథావిధిగా కొనసాగుతుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement