
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుకు దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ అధికారిణి గౌరి తెలిపారు. కలెక్టరేట్‌లోని పర్యాటక శాఖ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషియన్‌లో 2025–26కు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి జిల్లా కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, ఏపీ పర్యాటక శాఖలు సంయుక్తంగా ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హత ఆసక్తి ఉన్నట్‌లైతే 97013 43846, 97004 40604, 95021 13163 నంబర్‌లలో సంప్రదించాలన్నారు. కోర్సులు పూర్తి చేసే అభ్యర్థులకు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉద్యోగ అవకాశాలు, బ్యాంక్ రుణ సదుపాయం, బాల బాలికలకు వేరువేరుగా హాస్టల్ సదుపాయం కల్పిస్తారని చెప్పారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
కోర్సుల వివరాలు
1. బీయస్సీ, హెచ్, హెచ్.ఎ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు ఇంటర్ 40% మార్కుల పైగా సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ కోర్సులో ఎఫ్ అండ్ బి ప్రొడక్షన్, ఎఫ్ అండ్ బి సర్వీస్, కరెంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ నేర్పించి 4 నెలలు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారన్నారు.
2. క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ (సీసీఎఫ్‌పీపీ) కోర్సుకు పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సులో ఏడాది పాటు దేశ విదేశాల వంటకాలను నేర్పించి 6 నెలలు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారని తెలిపారు.
3. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుడ్ – బేవరేజ్ సర్వీస్ (సీసీఎఫ్‌బీఎస్ ) కోర్సుకు పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ కోర్సులో ఐదు నెలల పాటు రెస్టారెంట్, బార్ సర్వీస్ నేర్పించి 1 నెల ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారని చెప్పారు.