
బదిలీ దరఖాస్తులకు సాంకేతిక సమస్యలు
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్న సర్వర్ శుక్రవారం ఉదయం నుంచి మొరాయిస్తూనే ఉంది. బదిలీలు చేసుకునేందుకు నెట్ సెంటర్ల వద్దకు వెళ్తున్న టీచర్లకు నిరీక్షణ తప్పడంలేదు. గంటల తరబడి సర్వర్ పనిచేయకుండా పోతుండడంతో టీచర్లు విస్తుపోతున్నారు. అదే విధంగా దరఖాస్తులు చేసుకునే సమయంలో చాలా మంది టీచర్లకు ఓటీపీలు అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులు విన్నవిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
కానరాని హెల్ప్‌డెస్క్
బదిలీల కసరత్తు సమయంలో టీచర్లకు అనేక సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈవో కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి హెల్ప్‌డెస్క్ ను ఏర్పాటు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో టీచర్లు అవస్థలు ఎదుర్కుంటున్నారు.
దరఖాస్తు గడువు పొడిగించాలి
టీచర్ల బదిలీల దరఖాస్తు గడువు తేదీలను పొడిగించాలి. బదిలీలకు దరఖాస్తు చేసుకుంటుంటే సాంకేతిక సమస్యలు అధికంగా వస్తున్నాయి. టీచర్లు సకాలంలో దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకోలేక పోతున్నారు. ఓటీపీలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివిధ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులు బదిలీల గడువును పొడిగించాలి. – రెడ్డి శేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ట్రెజరర్, చిత్తూరు జిల్లా

బదిలీ దరఖాస్తులకు సాంకేతిక సమస్యలు

బదిలీ దరఖాస్తులకు సాంకేతిక సమస్యలు