
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 14 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 74,020 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,190 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం వచ్చింది.
టికెట్లు లేని వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది.
ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం: టిటిడి
తిరుమల, 2025, మే 13: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టిటిడి నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టిటిడి అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖల పై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది . నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.