తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీగా అనసూయమ్మ ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీగా అనసూయమ్మ ఏకగ్రీవం

May 20 2025 1:50 AM | Updated on May 20 2025 1:50 AM

తవణంప

తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీగా అనసూయమ్మ ఏకగ్రీవం

పోలీస్‌ గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు
పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 36 వినతులు అందాయి.

ప్రదక్షిణలతో సరి..

తాము నాటి పెంచిన మామిడి చెట్లను అగ్ర కులస్తులు నేలమట్టం చేశారని యానాదులు కన్నీటి పర్యంతమయ్యారు.

మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025

వైఎస్సార్‌సీపీకి పూర్వ వైభవం

తవణంపల్లె: వైఎస్సార్‌సీపీకి మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పని చేసి పూర్వవైభవం తీసుకురావాలని పూతలపట్టు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. రెండవ వైస్‌ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రానికి సునీల్‌కుమార్‌ విచ్చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో సమాలోచనల అనంతరం పార్టీ తరఫున రెండవ వైస్‌ ఎంపీపీగా ఎంపిక చేసిన అభ్యర్థికి బీ–ఫాం అందజేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు కలసికట్టుగా చెర్లోపల్లె ఎంపీటీసీ అనసూయమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. మండలంలోని పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలుపు నిచ్చారు. అనంతరం నూతనంగా ఎంపికై న రెండవ వైస్‌ ఎంపీపీ అనసూయమ్మను సత్కరించారు. రెండవ వైస్‌ ఎంపీపీగా అవకాశం కల్పించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికీ, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ హరిరెడ్డి, ఎంపీపీ ప్రతాప్‌ సుందర్‌రాయల్‌ రెడ్డి, హరికృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ గీతారెడ్డి, ధనంజయరెడ్డి, రవిరెడ్డి, రాజశేఖర్‌, మధుసూదన్‌ రెడ్డి, శివాజిరెడ్డి, మణిరాజ్‌, సుధాకర్‌, రమేష్‌ పాల్గొన్నారు.

ఎన్నికలకు హాజరైన 8 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు

తవణంపల్లె: తవణంపల్లె మండలం రెండో వైఎస్‌ ఎంపీపీగా వైఎస్సార్‌సీపీకి చెందిన చెర్లోపల్లె ఎంపీటీసీ సభ్యురాలు అనసూయమ్మ సోమవారం ఏకగ్రీకవంగా ఎన్నికైనట్టు మండల ఎన్నికల అధికారి, డీపీఓ సుధాకర్‌ ప్రకటించారు. తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీ పదవి ఖాళీ కావడంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు మేరకు రిటర్నింగ్‌ అధికారి సుధాకర్‌ తవణంపల్లె ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించారు. మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు సభ్యులు 14 మంది, టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు ఒకరు ఉన్నారు. ఇందులో వైఎస్సార్‌సీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రం ఎన్నికల హాల్లోకి హాజరుకాగా మిగిలిన వారు హాజరుకాలేదు. ఎన్నికల నియమావళికి మేరకు కోరం ఉన్నందున ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ఇద్దరు ఎంపీటీసీల సభ్యులను రిటర్నింగ్‌ అధికారి రిజిస్టర్‌లో సంతకం చేయలేదు కాబట్టి వెళ్ళిపోవచ్చని స్పష్టం చేశారు. 8 మంది ఎంపీటీసీల్లో ఒకరు చెర్లోపల్లె ఎంపీటీసీ అనసూయమ్మను మండల రెండో వైస్‌ ఎంపీపీగా ప్రతిపాదించగా, మరొకరు బలపరచడంతో రిటర్నింగ్‌ అధికారి సుధాకర్‌ అనసూయమ్మను రెండో వైస్‌ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎంపికై నట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీలతోపాటు పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సునీల్‌కుమార్‌కు, పలువురు నేతలకు అనసూయమ్మ ధన్యవాదాలు తెలిపారు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీగా అనసూయమ్మ ఏకగ్రీవం 1
1/2

తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీగా అనసూయమ్మ ఏకగ్రీవం

తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీగా అనసూయమ్మ ఏకగ్రీవం 2
2/2

తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీగా అనసూయమ్మ ఏకగ్రీవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement