సేవల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు 21వ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

సేవల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు 21వ ర్యాంకు

May 15 2025 2:22 AM | Updated on May 15 2025 2:22 AM

సేవల్లో జిల్లా వైద్య  ఆరోగ్యశాఖకు 21వ ర్యాంకు

సేవల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు 21వ ర్యాంకు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, మాతా శిశు ఆరోగ్యం తదితర 11 అంశాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు రాష్ట్రంలో 21వ ర్యాంకు వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి తెలిపారు. 11 అంశాల్లోనూ గ్రీన్‌ మార్క్‌లోనే ఉన్నామన్నారు. ఇందుకు గాను 76.6 మార్కులు వచ్చాయన్నారు. మరింతగా వైద్య సేవలను విస్తృతం చేసి జిల్లాకు మంచిపేరు తీసుకొస్తామని ఆమె పేర్కొన్నారు.

నెమళ్ల మృత్యుగీతం

– రైల్వే విద్యుత్‌ లైన్లకు తగిలి పడిపోతున్న వైనం

కుప్పం రూరల్‌ : కుప్పం మండలం, పెద్దబంగారునత్తం పరిసరాల్లో నెమళ్లు రాలిపోతున్నాయి. పెద్దబంగారునత్తం సమీపంలోని మార్వాడ సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద నెమళ్లు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆహారం కోసం అక్కడి నుంచి రైల్వే ట్రాక్‌ దాటుకుని ఇటువైపు పొలాల్లోకి వస్తున్నాయి. బెంగళూరు – చైన్నె రైల్వే లైన్‌ దాటుకుని రావాల్సి ఉంది. ఈ క్రమంలో నెమళ్లు రైల్వే విద్యుత్‌ లైన్లకు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. నిత్యం ఒకటి రెండు నెమళ్లు పడిపోయి దర్శనమిస్తున్నాయి. నిత్యం నెమళ్లు రైల్వే ట్రాక్‌పై పడిి ఉండడాన్ని చూసి స్థానికుల మనసు కలిచి వేస్తోంది. అటవీశాఖ అధికారులు అయినా నెమళ్లు ఇటు వైపుకు రాకుండా చూడాలని కోరుతున్నారు.

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని ఐసీడీఎస్‌ చిత్తూరు రూరల్‌ ప్రాజెక్టు పరిధిలోని మూడు అంగన్‌వాడీ పోస్టులకు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ శ్యామ్‌సుగుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు నగర పరిధిలోని జాన్సన్‌ గార్డెన్‌లో మినీ అంగన్‌వాడీ కార్యకర్త, లెనిన్‌ నగర్‌లో సహాయకురాలు, గుడిపాల మండలంలోని రామభద్రపురంలో సహాయకురాలు పోస్టు ఖాళీలున్నాయన్నారు. వీటిని భర్తీ చేసేందుకు ఈనెల 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, 24వ తేదీ సాయంత్రంతో స్వీకరణ ముగుస్తుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి చేసి కొంగారెడ్డిపల్లి ప్రాంతంలోని చిత్తూరు ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

వేరుశనగ విత్తన కేటాయింపు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లాలోని వ్యవసాయశాఖ డివిజన్‌ల వారీగా వేరుశనగ విత్తన కేటాయింపు చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ దృష్ట్యా జిల్లాకు 60 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కావాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం 25977.6 క్వింటాళ్ల కాయలను కేటాయించింది. అధికారులు వ్యవసాయశాఖ డివిజన్‌ వారీగా కేటాయింపు చేశారు. చిత్తూరు డివిజన్‌కు 8540.4, నగరికి 2421.0 క్వింటాళ్లు, పుంగనూరుకు 7941.0 క్వింటాళ్లు, పలమనేరుకు 7075.5 క్వింటాళ్ల మేర కేటాయించినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. కాగా ఇంత వరకు వేరుశనగ విత్తన రాయితీ ధర నిర్ధారణ కాలేదని తెలుస్తోంది.

మెరుగైన వైద్య సేవలందించాలి

కార్వేటినగరం : సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ హనుమంతరావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి మాట్లాడుతూ.. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి దీర్ఘకాలిక రోగులను గుర్తించి వారికి కావాల్సిన మందులను అందించాలని ఆదేశించారు. అలాగే కుష్ఠు, ఆస్త్మా రోగులను ముందుస్తుగా గుర్తించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా ఇమ్యునైజేషన్‌కు సంబంధించిన యూ–విన్‌ పోర్టల్‌ను ఓపెన్‌ చేసి పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వర్షాలకు ఉరుస్తుందని సిబ్బంది అధికారి దృషికి తీసుకెళ్లడంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో మరమ్మతులు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాఽధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement