
జిల్లాలో ముమ్మర తనిఖీలు
101 కేసుల నమోదు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఎస్పీ మణికంఠ చిత్తూరు నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సైతం తనిఖీ చేశారు. ప్రజల భద్రతను మెరుగుపరచి, నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో 1,781 వాహనాలను తనిఖీ చేయగా, నిబంధన లు పాటించని 101 మందిపై కేసులు నమోదు చే శారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 9 మందిపై, చౌడేపల్లెలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టారు. పెద్దపంజాణిలో సరైన బిల్లులేకుండా సరఫరా చేస్తున్న 10 వేల లీ టర్ల డీజిల్ ట్యాంకర్‌ను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్ వాయిదా
చిత్తూరు అర్బన్: చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం జరగాల్సిన జాతీయ లోక్‌అదాలత్‌ను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్.భారతి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అదాలత్‌ను జూలై 5వ తేదీన నిర్వహించన్నుట్లు పేర్కొన్నారు. కక్షిదారులు సహకరించాలని కోరారు.
ఎన్‌సీడీ సర్వే పూర్తి చేయండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎన్‌సీడీ సర్వే వే గవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని డీఎంఅండ్‌హెచ్ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చాలా పీహెచ్‌సీల పరిధిలో ఎన్‌సీడీ సర్వే చేయడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారన్నారు. ఎందుకంతా నిర్లక్షమని, సర్వే త్వరితగతినగా పూర్తి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్‌సీహెచ్‌ఐడీ, అభ ఐడీకి అనుసంధాన ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని ఆమె సూచించారు.