
అత్యవసరమైనా ఉండరే?
కుప్పం: శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో సుమంగళి సౌభాగ్య మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జాతరలో ఈ ఏడాది నూతనంగా సుమంగళి సౌభాగ్య మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రారంభించింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం ముత్తైదువులు సారె సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టింది. మహళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పసుపు, కుంకుమ, వస్త్రాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి తరలివచ్చిన మహిళలకు కమిటీ సారెను అందజేసింది. ఆలయ ప్రాంగణం నుంచి చెరువు కట్టపై ఉన్న బావి దగ్గరకు వెళ్లి శిరస్సు, కళ్లు తెర తొలగించే చోట ఈ మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం ర్యాలీగా ఆలయానికి తరలివచ్చారు.
20 వేల మందికి అన్నదానం
జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. 19 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు. ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డు ప్రాంగణంలో సంపక్తి భోజనాలను వడ్డించారు. సుమారు 20 వేల మందికిపైగా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
పురవీధుల్లో ఊరేగింపు
గంగ జాతర సందర్భంగా ముత్తుమారెమ్మ ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. పలకవాయిద్యాల మధ్య పాతపేట, కొత్తపేట, రైల్వేగేటు వరకు అమ్మవారి ఉత్సవ ఊరేగింపును చేపట్టారు.
చౌడేపల్లె: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌తో సహా సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదు. ఒకవేళ వచ్చినా రోగులను సక్రమంగా పట్టించుకోవడం లేదు. ఇలాంటిదే శుక్రవారం ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని పందిళ్లపల్లెకు చెందిన పీ.రెడ్డిప్రసాద్(33) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మారిస్థితికి చేరాడు. కుటుంబ సభ్యులు పవన్, మనోహర్ అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రిలో సిబ్బంది ఎవరూ లేరు. బిగ్గరగా అరుస్తూ అత్యవసర కేసు వచ్చింది.. ఎవరూ లేరే.. రండి డాక్టర్, నర్సు ఎక్కడ అంటూ కేకలు వేశారు. సుమారు అర్ధగంట అయినా ఎవరూ రాలేదు. తరువాత సిబ్బంది ఒకరు వచ్చి స్టాఫ్ ఎవరూ లేరని చెప్పారు. తర్వాత 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి డాక్టర్లు శుక్రవారం అతన్ని తిరుపతి స్విమ్స్‌కు రెఫర్ చేశారు.

అత్యవసరమైనా ఉండరే?

అత్యవసరమైనా ఉండరే?

అత్యవసరమైనా ఉండరే?