
కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని 35 పరీక్ష కేంద్రాల్లో మూడో రోజు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష లు ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఐఈఓ డా. ఆదూరు శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం నిర్వహించిన జనరల్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 7568 మందికి గాను 7252 మంది విద్యార్థులు హాజరు కాగా 315 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్‌లో 348 మందికి 320 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరైనట్లు వివరించా రు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్స రం జనరల్ పరీక్షలో 1556 మందికి 1468 మంది విద్యార్థులు హాజరు కాగా 88 మంది పరీక్షకు హా జరు కాలేదన్నారు. ఒకేషనల్‌లో 119 మందికి 108 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలోని సదుం, సోమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించినట్లు ఆయన తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు దయానందరాజు, బాలసుబ్రహ్మణ్యం, శరత్‌చంద్ర శేఖర్‌లు 11 కేంద్రాలను, ప్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు 16 కేంద్రాలను తనిఖీలు చేశారన్నారు.