
మానవత్వానికి మరో పేరు జగన్
కార్వేటినగరం: దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వానికి మరో పేరుగా మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి తన గొప్పతనాన్ని చాటుకున్నారని తెలిపారు. గతంలోనూ పలు ఘటనల్లో ఉదారంగా బాధిత కుటుంబాలకు సాయం అందించారని గుర్తుచేశారు.
కాపాడుతారా.. వత్తాసు పలుకుతారా!
– అటవీభూమి కబ్జా కేసు నీరుగార్చే కుట్ర
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి నేతల అటవీ భూ కబ్జా వ్యవహారం తప్పుదారి పట్టేలా ఉంది. ఆక్రమణదారులను వదిలి పెట్టాలనే ప్రయత్నం జోరుగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు మండలం, ఎగువమాసాపల్లి ప్రాంతంలో అటవీ భూమి కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు గురువారం అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు జేసీబీలను సీజ్ చేయగా.. ఇద్దరు డ్రైవర్లను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆక్రమిత భూమి పై అటవీ, రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఇది అటవీశాఖ భూమి అని తేల్చారు. అయితే కూటమి బడా నేతలు ఆక్రమణదారులను ఈ కేసు నుంచి తప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతుండడం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా ఈ విషయంపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.