
సారా తయారీ.. అన్నదమ్ముల అరెస్ట్
● నల్లబెల్లం విక్రయించిన రైతు కూడా అరెస్ట్
చిత్తూరు అర్బన్: సారా తయారు చేస్తున్న వై.కిషోర్ (36), వై.నవీన్ (41) అనే ఇద్దరు అన్నదమ్ములను చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అర్బన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ శ్రీహరిరెడ్డి కథనం.. గుడిపాల మండలంలో సారా తయారీ ఎక్కువగా ఉందని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం పాపిశెట్టి గ్రామ పరిసరాల్లో విస్తృత దాడులు చేశారు. ఇక్కడున్న అడవుల్లో సారా కాస్తున్న కిషోర్, నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 500 లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. నిందితులకు నల్లబెల్లం విక్రయించాడని కొండేపల్లెకు చెందిన రైతు పెరుమాల్ (54)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి 50 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ మోహన్‌కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.