దైవదర్శనానికి వెళ్తూ ప్రమాదం
రొంపిచెర్ల : తమిళనాడులోని అరుణాచలం దైవదర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కడప యర్రముక్కపల్లెకు చెందిన రమణ కుటుంబ సభ్యులు ఏడుగురు అరుణాచలం ఆలయ దర్శనం కోసం ఆదివారం బయలుదేరారు. చిత్తూరు మీదుగా వెళ్లాల్సిన వారు తిరుత్తణికి వెళ్లి అక్కడ దేవుని దర్శనం చేసుకుని మళ్లీ అరుణాచలం పోదామని వెళ్తుండగా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు బస్టాప్ వద్ద తిరుపతి నుంచి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, అరుణాచలం వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రమణ (59), భార్య రాధ(55), చైతన్య(16), రేష్మిక (4) గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో చికిత్స కోసం పీలేరు ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన మహిళ రాధ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దైవ దర్శనానికి వెళ్తూ జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, కారు రెండు దెబ్బతిన్నాయి. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శిఽంచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు.. కారు ఢీ : మహిళ మృతి
ముగ్గురికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తూ ప్రమాదం
దైవదర్శనానికి వెళ్తూ ప్రమాదం
దైవదర్శనానికి వెళ్తూ ప్రమాదం
దైవదర్శనానికి వెళ్తూ ప్రమాదం
దైవదర్శనానికి వెళ్తూ ప్రమాదం


