
నేడు పోలీసు గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్ : నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.
పే..ద్దపాము
చౌడేపల్లె : చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రి పంచాయతీ కోటూరు సమీపంలోని పంట పొలంలో వేసిన గుడిసెలో తొమ్మిది అడుగుల పొడవు గల భారీ జెర్రిపోతును ఆదివారం గుర్తించారు. పొలం యజమానులు భయంతో అక్కడే చంపేశారు.