
చైన్ స్నాచర్ అరెస్టు
నగరి : కొంతకాలంగా నగరి, విజయపురం ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల్లో వెళుతూ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో చైన్లను చోరీ చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న చైన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, సీఐ విక్రమ్ లు కథనం మేరకు.. నగరి సబ్‌డివిజన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల ఛేదనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నగరి పరిసర ప్రాంతాలు, తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పాత నేరస్తులతో పాటు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. శనివారం ఉదయం సీఐకి అందిన సమాచారం మేరకు, నాగలాపురం జంక్షన్ వద్ద విజయపురం మండలం, ఇల్లత్తూరుకు చెందిన అజిత్ (27)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఆనంతప్పనాయిడుకండ్రిగ, విజయపురం మండలం పన్నూరు సబ్‌స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనంలో వచ్చి మహిళల మెడలో చైన్ స్నాచింగ్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఒక అపాచీ మోటార్ సైకిల్, చోరీ చేసిన సుమారు రూ.4 లక్షల విలువైన 45 గ్రాముల బరువు రెండు బంగారు బొందు చైన్లులు స్వాధీనం చేసుకున్నారు. అజిత్ అరెస్టులో ప్రతిభ కనబరిచిన సిబ్బంది లోకనాథం, గణేష్, ధన కోటి, రమేష్‌ను అభినందించడంతోపాటు వారికి రివార్డులు అందించారు.
నూతన కార్యవర్గం
చిత్తూరు కార్పొరేషన్: పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా పరిషత్ యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీ వివరాలను ఎన్నికల అధికారి పీఎంఆర్ ప్రభాకర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సురేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా చలపతిరెడ్డి, సుజాత, లక్ష్మీపతి, కార్యదర్శిగా రాజేంద్రన్, సహాయ కార్యదర్శులుగా రూప్‌సాగర్, బాలకృష్ణ్ణ ఎన్నికయ్యారు. అలాగే కార్యనిర్వహక కార్యదర్శిగా చక్రవర్తి, కోశాధికారిగా వాసుదేవరావు, జిల్లా కౌన్సిలర్లుగా గిరిధర్‌రెడ్డి, శశిధర్ చౌదరి, చంద్రశేఖర్‌రెడ్డి, తులసీరామ్, దస్తగిరిసాహెబ్, సుష్మకీర్తి, శ్రీనివాసులు, హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఎన్నికలకు పరీశీలకులుగా చెంచురత్నం, చక్రపాణి వ్యవహరించారు.

చైన్ స్నాచర్ అరెస్టు