
కుంజేగానూరులో భూచోళ్లు
కుప్పం: పశువులకు మేతకు సౌకర్యంగా ఉన్న గుట్ట పొరంబోకుపై కొందరు కూటమి నేతల కన్ను పడింది. గుట్టకు ఆనుకుని ఉన్న డీకేటీ భూములను చూపిస్తూ గుట్ట పొరంబోకును చదును చేసి లేఅవుట్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి చదును చేసి లేఅవుట్‌గా మార్చి ప్లాట్లు వేసి, లాభార్జన గడించే పనిలో కూటమి నేతలు నిమగ్నమయ్యారు.
గుట్టపొరంబోకు చదును
మండలంలోని కుంజేగానూరు రెవెన్యూ పరిధిలో బస్టాండ్ వద్ద 2.40 ఎకరాల గుట్టపొరంబోకు స్థలం ఉంది. ఈ భూమిలో కుంజేగానూరు, ఎన్.కొత్తపల్లి, నూటకుంటకు చెందిన గ్రామాల్లోని పశుపోషకులు పశువుల మేత బీడుగా ఉపయోగిస్తున్నారు. కుంజేగానూరు బస్టాండ్‌కు ఎదురుగా రోడ్డు పక్కన ఉండడంతో ఈ భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. దీన్ని ఎలాగైన కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేపట్టా రు. తమ అనుభవంలో ఉన్నట్లు కొందరు టీడీపీ నేత లు నకిలీ రికార్డులు సృష్టించి, స్వయం ఉపాధి కోసం రెండు దుకాణాల రూములను నిర్మిస్తున్నారు. 2.40 ఎకరాల గుట్ట పొరంబోకును చదును చేసి ప్లాట్లుగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇది ఇ లా ఉండగా మరోవైపు గరికచీనేపల్లెకు చెందిన ఓ టీడీపీ ప్రధాన నేత కుంజేగానూరుకు వెళ్లే ఆవుల ఓనిని పూర్తిగా చదును చేసి, బొప్పాయి పంటను సాగు చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పశువులను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకువెళ్లేందుకు ఈ ఆ వులఓనిగా వినియోగించేవారు. టీడీపీ నేత దాన్ని ఆక్రమించడంతో వారు ఇక్కట్లు పడుతున్నారు.
ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
టీడీపీ నేత ఆవుల ఓని చదును చేసి, పొలంలో క లుపుకుని బొప్పాయి సాగు చేస్తున్నారని గతంలో రెవెన్యూ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని మరికొందరు టీడీపీ నేతలు గుట్టపొరంబోకు కబ్జా కు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ శాఖాధికారులకు ఫిర్యాదు చేయగా తాము డీకేటీ పట్టా పొందామని రికార్డులు చూపిస్తూ వ్యవహరిస్తునట్లు సమాచారం. ఉన్న తాధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.

కుంజేగానూరులో భూచోళ్లు