12న డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన | - | Sakshi
Sakshi News home page

12న డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన

May 10 2025 12:25 AM | Updated on May 10 2025 12:25 AM

12న డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన

12న డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన

చిత్తూరు కలెక్టరేట్‌ : విద్యాశాఖ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఈ నెల 12వ తేదీన డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్న ట్లు యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ అన్నారు. ఈ మేరకు నిరసన కార్యక్రమానికి సంబంధించి ముందస్తు నోటీసును శుక్రవారం డీఆర్వో మోహన్‌కుమార్‌, డీఈఓ వరలక్ష్మికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్షధోరణి ప్రదర్శిస్తుందన్నారు. విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ, ఏ విధమైన స్పష్టమైన జీఓలు లేకుండానే రోజుకో వింత ఆలోచనలతో ఉపాధ్యాయుల సర్దుబాటు తీవ్ర ఆందోళనకు లోను చేస్తోందన్నారు. వారం వారం ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సమావేశాల్లో సమస్యలు వెల్లడిస్తున్నా ఏ మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ సమస్యలు చెలరేగుతున్నాయన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతుల సమస్యలు పరిష్కరించాలని పదే పదే చెబుతున్నా ఏ మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. ఉపాధ్యాయుల ఆందోళనను గమనించి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖరనాయుడు, మణిగండన్‌, గౌరవాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సహధ్యక్షులు రెడ్డెప్పనాయుడు, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎస్పీ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement