
వినాయకుడి సన్నిధిలో ఐఆర్‌ఎస్ అధికారులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శుక్రవారం పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. వేద ఆశీర్వచన మండపంలో పండితుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు అందజేశారు. ఏఈవో రవీంద్రబాబు వారికి ప్రసాదం, స్వామి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ పాల్గొన్నారు.
హంద్రీ–నీవా కాలువ పనుల పరిశీలన
వి.కోట: హంద్రీ–నివా సుజల స్రవంతి రెండో దశ కుప్పం ఉప కాలువ పనులను శుక్రవారం రాష్ట్ర జలవనరుల అభివృద్ధిశాఖా మంత్రి నిమ్మల రా మానాయుడు పరిశీలించారు. మండలంలోని దా సార్లపల్లి గ్రామం వద్ద జరుగుతున్న పనులను ప లమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మండల అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు ఆయనకు ఘన స్వా గతం పలికారు. అనంతరం ఆయన కాలువ పను లు పరిశీలించి పలు సూచనలు చేసి మాట్లాడారు. నాణ్యతతో త్వరతగతిన పనులను పూర్తి చేయా లని కాంట్రాక్టర్లను కోరారు. పలమనేరు ఆర్‌డీఓ భవాని, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

వినాయకుడి సన్నిధిలో ఐఆర్‌ఎస్ అధికారులు