
మొక్కలు సంరక్షించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్క లు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్, వివిధ శాఖల కార్యాలయాల్లో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్‌లోని ప్రాంగణంలో కలెక్టర్, జేసీ విద్యాధరి, డీఆర్‌వో మోహన్‌కుమార్ మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ ఆధ్వర్యంలో మొక్కలు నాటా రు. కలెక్టరేట్ ఏవో కులశేఖర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వాసుదేవన్, డీఈవో కార్యాల యం ఏడీ–2 వెంకటేశ్వరరావు, సిబ్బంది మురళి, గో పాల్, కుమార్, చైతన్య, జయప్రకాష్, పాల్గొన్నారు.