
రసవత్తరంగా కుస్తీ పోటీలు
– జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొన్న వివిధ జిల్లాల క్రీడాకారులు నువ్వా...నేనా అన్నట్టు తలబడ్డారు. ఈ పోటీలకు రాష్ట్ర స్థాయిలోని వివిధ జిల్లాల నుంచి అండర్–17, అండర్–23 విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి రోజు ప్రారంభమైన ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన అండర్ 17 బాల, బాలికల కుస్తీ క్రీడాకారులు తలబడ్డారు. ఈ నెల 17న నిర్వహించే పోటీల్లో అండర్ 23 బాల, బాలికల జట్ల క్రీడాకారులు పాల్గొననున్నారు. కుస్తీ పోటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కే పురుషోత్తం, రాష్ట్ర సెక్రటరీ భూషణం, కోచ్ రఫి పాల్గొన్నారు.