
కష్టపడేవారికే గుర్తింపు
బాధ్యత లేదా..?
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థానికంగా గర్భస్రావం చేసుకుంటుంటే ఎవరికీ బాధ్యత లేదా..? అంటూ కలెక్టర్ మండిపడ్డారు.
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025
కూటమి నేతలు భూ కుబేరులవుదామని స్కెచ్ వేశారు. ఇదే అదునుగా విలువైన భూములపై కన్నేశారు. అప్పన్నంగా దోచేయాలని పావులు కదిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయారు. ప్రభుత్వ భూములను ఇబ్బడిముబ్బడిగా కబ్జాచేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బినామీ పేర్లపై ఎక్కించుకుని ఆ భూమి మాదే అంటూ మెలిక పెడుతున్నారు. బాస్ వెనుకున్నారని మరింత రెచ్చిపోతున్నారు. ఇది ముమ్మాటికి ఆక్రమణే అని తెలిసినా.. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా జంకుతున్నారు. ఇంతకీ ఈ కుబే రుల భూదందా ఎక్కడో మీరే చదవండి..!
సాక్షిటాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం, అనుపల్లి నుంచి బండపల్లి, 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లి ప్రాంతం మీదుగా తచ్చూరు నేషనల్ హైవే రోడ్డు ఉంది. దీనిపక్కనే భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా భూమి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఇదే అదునుగా భూకుబేరులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ముడుపులకు ఆశపడిన కొందరు సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయోనని గాలించారు. మేత బీడు, వంక భూములు, డీకేటీ భూములు, అటవీశాఖ భూములను వరుసగా దోచుకునేందుకు పక్కా స్కెచ్చేశారు. సర్వేయర్‌తో స్కెచ్ గీయించుకుని వీర్వోలను బుట్టలో వేసుకున్నారు. భూకుబేరుల కుటుంబీకులు, వాళ్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను బినామీగా మలుచుకున్నారు. వాళ్లకే తెలియకుండా 25 నుంచి 30 మంది వరకు ఎకరా నుంచి రెండు ఎకరాల మేర పలు సర్వే నంబర్లలో భూములు కేటాయించారు.
ఎగువమాసాపల్లి వద్ద ఏం చేశారంటే..
194. వెంకటాపురానికి చెందిన కూటమి నేత, భూకుబేరుడు ఒక పార్టీకి చెందిన వారే. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. దూరపు బంధువులు కూడా. ఈ నేపథ్యంలో 194 వెంకటాపురం వద్ద ఎందుకు భూ సమస్య అంటూ వదలిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రూట్ మార్చుకుని ఎగువమాసాపల్లి ప్రాంతంలో 20 ఎకరాల భూములున్నాయని తెలుసుకున్నారు. అక్కడి అటవీశాఖ, డీకేటీ భూములను ఆక్రమించే పనిలో పడ్డారు. అనుచరులను రంగంలోకి దింపి జేసీబీలతో చదును చేయించారు. మూడో రోజు ముచ్చటగా ఎగువమాసాపల్లికి చెందిన కూటమి నేత, గ్రామస్తులు కలిసి అటవీశాఖ అఽధికారులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తే అది అటవీ భూమి అని తేలింది.
బాస్ ఉన్నారనే..
అధికారం ఉంది.. బాస్(తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే) అండ ఉంది.. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భూకుబేరులు ప్రభుత్వ భూములను ఆక్రమించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఆక్రమిత భూముల జోలికి ఎవరు అడ్డొచ్చినా బాస్ పేరుతో బెదిరిస్తున్నారు. ‘భూములు నావి కావు.. మా బాస్‌వే... మీ వల్లయ్యింది చేసుకోండి’ అంటూ భూకుబేరులు బహిరంగంగా చెబుతున్నారు. మేమంతా బినామీలే.. .. టచ్ చేస్తే ఎలికాప్టర్‌లోనే దిగుతారని భయపెడుతున్నారు. కాగా ఈ భూమి పక్కాగా చేతుల్లోకి వస్తే బినామీలు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చేలా డీల్ సెట్ చేశారని సమాచారం. అందుకే ఆ బినామీలు కూడా భూ కుబేరుల వెనుక బ్రహ్మస్తంలా పనిచేస్తున్నారు.
ఆక్రమణకు గురైన అటవీ భూమి
బీపీ హరిస్తోంది
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల బీపీ వెంటాడుతూ మనుషులను హరిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి తెలిపారు. చిత్తూరులోని తన కార్యాలయంలో శనివారం ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో బీపీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ప్రజలు సరైన ఆహార నియమావళి పాటించకపోవడంతో ఈ బీపీ అల్లుకుపోతుందని తెలిపారు. జంక్ ఫుడ్స్, మద్యం, మాంసాహారం అతిగా తీసుకోవడం వల్ల బీపీ సమస్యలు తలెత్తుతాయన్నారు. అలాగే మానసిక ఒత్తిడిలు కూడా బీపీ వ్యాప్తికి ప్రధాన కారణమన్నారు. ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేయాలన్నారు. వైద్యాధికారులు హనుమంతరావు, గిరి, అనిల్, కుమార్, ప్రవీణ, అనూష పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
బైరెడ్డిపల్లె: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. మండల పరిధిలోని బైరెడ్డిపల్లె, పాతపేట, పాతురునత్తం గ్రామ సచివాలయాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రం చేయడంలో ప్రజలను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలను విరివిగా పెంచినప్పుడే వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు సంమృద్ధిగా కురుస్తాయన్నారు. ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ, స్వచ్చభారత్ ఎంసీఓ సురేష్‌బాబు, సర్పంచులు వెంకటేష్, రోజా, పంచాయతీ కార్యదర్శులు సదాశివయ్య, మోహన్, రాంప్రసాద్, పాల్గొన్నారు.
ఆధునిక డిజిటల్ నైపుణ్యం కలిగి ఉండాలి
గుడిపాల: ప్రతి రైతూ ఆధునిక డిజిటల్ నైపుణ్యం కలిగి ఉండాలని వ్యవసాయశాఖ ఏడీఏ ఉమ, వ్యవసాయాధికారి మాధవి తెలిపారు. శనివారం మండలంలోని పాపసముద్రం సచివాలయంలో రైతులకు స్కిల్ ఆఫ్ చిత్తూరు, డిజిటల్ ట్రైనింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులకు ఆధునిక డిజిటల్ నైపుణ్యం కలిగించి సాంకేతిక వ్యవసాయ పరిజ్ఞానం, వ్యవసాయ యాప్‌లు, డిజిటల్ ఫేమెంట్స్, యూట్యూబ్ చానల్స్ నిర్వహణ, వాతావరణం, మార్కెట్ ధరల గురించి అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ సిబ్బంది తులసీరాంరెడ్డి పాల్గొన్నారు.
ఆర్‌డీఎస్‌ఎస్ పనులు త్వరగా చేయండి
చిత్తూరు కార్పొరేషన్: గ్రామీణ ప్రాంతాలకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరాను అందించే ఆర్‌డీఎస్‌ఎస్ పనులు త్వరగా చేయాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. శనివారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల ట్రాన్స్‌కో ఎస్‌ఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదన్నారు. ఫీడర్ల వారీగా పను లు వేగవంతం చేయాలన్నారు. అవసరమైన మెటీరియల్స్ సి ద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే పల్లెలకు మెరుగైన విద్యుత్ అందించవచ్చొన్నారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గాలీవాన వచ్చినప్పుడు ఎక్కువ గా సమస్యలు వస్తున్నాయని, పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు నష్టంతో పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఆ సమయాల్లో వెంటనే విద్యుత్ స్తంభాలు, లైన్, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో లోడ్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాలన్నారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ట్రాన్స్‌కో కార్యాలయం నుంచి ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ పాల్గొన్నారు.
ఏపీ ఈఏపీ సెట్‌కు 7,849 దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏపీ ఈఏపీ సెట్ 2025 (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు 7,849 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలకు ఈ ఏడాది మార్చి 12వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరించారు. ఈ నెల 12వ తేదీన పరీక్షల హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. చిత్తూరు, పలమనేరు పరిధిలో 7,849 మంది ఈఏపీ సెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ పరీక్షకు 6,103, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 1,716, రెండు పరీక్షలకు 30 మంది మొత్తం 7,849 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు ప్రవేశ పరీక్షలు ఈనెల 19, 20 తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షలకు ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
● ఎమ్మెల్సీ భరత్
కుప్పంరూరల్: వైఎస్సార్ సీపీలో కష్టపడేవారికే గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ, కుప్పం ఇన్ చార్జి భరత్ అన్నారు. శనివారం కుప్పం పట్టణంలోని తన నివాసంలో కుప్పం మండల నాయకులతో మాట్లాడారు. ఇటీవల చా లా మంది పార్టీని వీడారని, వారి కి పార్టీ ఎంతో చేసిందని, అలాంటి వారు మనస్సా క్షి లేకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. మరికొంత మంది పార్టీలోనే ఉంటూ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. మరింత మందిని సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమన్నారు. నీతి, నిజాయితీ గల కార్యకర్తలు కొంత మంది ఉన్నా, తాము రాజకీయాలు చేసుకోగలమని, ఏ ఒక్కరిపైనో మాధారపడి నడవడం లేదన్నారు. కష్టకాలంలో ఎవరు పార్టీకి అండగా ఉంటారో రేపు అధికారం వచ్చిన తరువాత వారికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఇప్పటికే అధికార పార్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ఎందుకు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశామా..? అని మదనపడుతున్నారని తెలిపారు. మండల కన్వీనర్ హెచ్‌ఎం మురుగేష్ మాట్లాడుతూ, అక్ర మ కేసులు, తాటాకు చప్పుళ్లకు ఎవరూ బయపడొద్దని, మన ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని కేసులు పోతాయన్నారు. అధైర్యపడొద్దు ... అండగా అంటామనిభరోసా ఇచ్చారు. అన ంతరం ఇటీవల పార్టీ పదవులు అలంకరించిన వారిని సత్కరించారు. కార్యక్రమంలో నాయక లు వనితాశీను, భాగ్యరాజ్, జీవీ.రమేష్, చిన్న దొరై, నాయకులు పాల్గొన్నారు.
నివేదిక సిద్ధం!
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు రూరల్ మండలం ఎగువమాసపల్లె ప్రాంతంలో అటవీ ప్రాంతం ఆక్రమణ పర్వం పై నివేదిక దాదాపు సిద్ధమైంది. తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు గురువారం అటవీ ప్రాంతంలో జేసీబీలను పెట్టి చదును చేసి కబ్జాకు యత్నించారు. అటవీశాఖాధికారులకు క్షేత్ర స్థాయిలో రెండు జేసీబీలను సీజ్ చేసి డ్రైవర్లను అదుపులో తీసుకున్నారు. శుక్రవారం రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఆ స్థలంలో సర్వే చేశారు. అది అటవీ భూమి అని తేలింది. ఇందులో భాగంగా డ్రైవర్లను విచారించారు. ఇది తమ భూమి అని ఆక్రమణదారులు నమ్మబలికి చదును చేయించారు. ఆక్రమణదారుల నివాసాల వద్దకు వెళ్లి అటవీ సిబ్బంది విచారించగా వారు అక్కడ లేనట్లు గుర్తించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాల ఆధారంగా డీఎఫ్‌ఓ భరణికి నివేదికను సోమవారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
194.వెంకటాపురం,
ఎగువమాసాపల్లిలో భూకుంభకోణం
40 ఎకరాల మేర మేత బీడు, వంక భూముల ఆక్రమణ
బినామీ పేర్లతో కాజేసిన కూటమి నేత
బాస్ వెనకున్నారని బరితెగింపు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
194 వెంకటాపురంలో...
బండపల్లి రెవెన్యూలో తచ్చూరు రోడ్డు ఆను కుని ఉన్న 194 వెంకటాపురంలో 30 ఎకరాల దాకా మేత బీడు ఉంది. ఇందులో 20 ఎకరాల భూమి తనదే అంటూ అదే గ్రామానికి చెందిన కూటమి నేత జేసీబీతో చదును చేశాడు. విషయం తెలుసుకున్న భూకుబేరులు తమదే భూమి అంటూ ఏకంగా మామిడి మొక్కలు పెట్టేశారు. ఈ భూ వ్యవహారంపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ మండల రెవెన్యూ అధికారులను విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. నాటిన మొక్కలను తొలగించాలని హుక్కుం జారీ చేశారు. అధికారులు మామిడి మొక్కలను తొలగించి.. మేత బీడుగా ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. కొన్ని నెలల తర్వాత స్థానికంగా ఉన్న నేత మళ్లీ ఆ భూమి తనదే అంటూ బోర్డు పెట్టారు. ఈ బోర్డును భూకుబేరులు కొట్టిపడేశారు. ఇది వివాదంగా మారడంతో భూకుబేరులు ఇప్పుడు రూటు మార్చారు.
సర్వేలో అటవీ భూమిగానే గుర్తించాం
ఎగువమాసాపల్లిలో ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించాం. రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నాం. జేసీబీలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. వారు ఇచ్చిన సమాచారం మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్నాం. వీటిని సోమవారం డీఎఫ్‌కు అందిస్తాం. ఆక్రమణదారులపై తదిపరి చర్యలు ఉంటాయి. రెవెన్యూ అధికారులతో సర్వే చేయగా ఆక్రమిత భూమి అటవీ భూములని తేలింది.
–థామస్, ఎఫ్‌ఆర్‌ఓ, చిత్తూరు ఈస్ట్
కబ్జా చేశారనేది వాస్తవం
భూ ఆక్రమణపై ఫిర్యాదులొచ్చాయి. ఇప్పుడు చదును చేసిన భూమి అటవీశాఖ భూమి అని తేలింది. రెవెన్యూ భూముల విషయానికి సంబంధించి తహసీల్దార్ కూడా నోటీసులు ఇచ్చారు. తప్పు అని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, ఆర్డీఓ, చిత్తూరు
ఆక్రమణలపై చర్యలేవి?
ఇక అటవీశాఖ అధికారులు ఆక్రమణదారులపై కేసు పెట్టేందుకు జంకుతున్నారు. కూటమి నేతల ఒత్తిడి ఉండడంతో అటవీశాఖ అధికారులు నోరువిప్పలేక పోతున్నారు. భూ ఆక్రమణదారులు పరారీలో ఉన్నారని సాకుచూపుతున్నారు. దీనికితోడు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల కనుసన్నల్లో మునిగి తేలుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే భూ ఆక్రమణల జోలికి రెవెన్యూ అధికారులు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలపై గ్రామస్తులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కష్టపడేవారికే గుర్తింపు

కష్టపడేవారికే గుర్తింపు

కష్టపడేవారికే గుర్తింపు

కష్టపడేవారికే గుర్తింపు

కష్టపడేవారికే గుర్తింపు

కష్టపడేవారికే గుర్తింపు

కష్టపడేవారికే గుర్తింపు