
7 రకాల రేషన్ కార్డుల సేవలకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పౌరసరఫరాల శాఖకు సంబంధించి 7 రకాల రేషన్‌కార్డుల సేవల కు అవకాశం కల్పించారని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన 7 రకాల రేషన్‌కార్డుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో కొత్తరేషన్ కార్డులు, బియ్యం కార్డులో సభ్యుల చేర్పులు, మార్పులు (బర్త్, పెళ్లి), బియ్యం కార్డు నుంచి సభ్యుల విభజన, బియ్యం కార్డులో సభ్యుల పేర్లు తొలగింపు (మృతులు మాత్రమే), కార్డులు సరెండర్, బియ్యం కార్డులో చిరునామా మార్పు, తప్పుడుగా నమోదైన ఆధార్ సీడింగ్ దిద్దుబాటుకు అవకాశం కల్పించారు. జిల్లాలో ఇప్పటికీ ఏ రేషన్‌కార్డులోను నమోదు కాని అర్హత కలిగిన పేదలు కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కార్డు ఉండి ఏవైనా సవరణలుంటే దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 7,707.484 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించగా మే, 2025 నెలకు గాను 8,642.431 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ రేషన్‌షాపులోనైనా బియ్యం ఇంకా అవసరం ఉంటే సంబంధిత తహసీల్దార్ స్పష్టమైన నివేదికను పంపాలని ఆదేశించారు. రేషన్‌కార్డు లబ్ధిదారులు తమకు అందాల్సిన రేషన్ ను సంబంధిత ఎండీయూ వాహన ఆపరేటర్, రేషన్‌షాపు డీలర్ వద్ద పొందాలని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు.
విభిన్నప్రతిభావంతులకు ఉచిత డీఎస్సీ శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న విభిన్న ప్రతిభావంతులు ఈ నెల 11 వ తేదీ లోపు www.mdfc.apefss.in (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎండీఎఫ్‌సీ.ఏపీఈఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్) వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 40 శాతం వైకల్యం ఉన్న అంధులు, బధిరులు, శారీరక విభిన్నప్రతిభావంతులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులని ఆయన వెల్లడించారు.
బోయకొండ హుండీ రాబడి రూ.63.89 లక్షలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ కానుకలు లెక్కింపు ద్వారా ఆలయానికి రూ.63.89 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ.63,89,617, బంగారం 40 గ్రాములు, వెండిి 470 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ7 నోట్లు లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం 42 రోజులు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు అని ఈఓ చెప్పారు. అలాగే రణభేరి గంగమ్మ ఆల య హుండీ ద్వారా రూ.40,463 నగదు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఇన్‌స్పెక్టర్ శశికుమార్, ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

7 రకాల రేషన్ కార్డుల సేవలకు అవకాశం