
మొక్కలను సంరక్షించాలి
మొక్కలు నాటడంతోపాటు వాటిని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ సూచించారు.
ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఈ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో నిర్వహించారు. ప్రధాన పరీక్షల్లో చివరి రోజు శనివారం ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షల్లో జనరల్, వొకేషనల్‌లో 5,600 మందికి గాను 510 మంది, మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1,467 మందికి గాను 115 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని పాలసముద్రం, నగరి బాలురు, బాలికలు, పుత్తూరు బాలురు, బాలికలు, వడమాలపేట కేంద్రాలను ఆర్జేడీ, చిత్తూరు డీఐఈఓ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వైస్ ఎంపీపీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
తవణంపల్లె: ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు తవణంపల్లె మండల వైస్ ఎంపీపీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీపీఓ సుధాకర్ తెలిపారు. తవణంపల్లె మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. మండలంలోని 15 ఎంపీటీసీలు ఎన్నికల్లో పాల్గొని చేతులు ఎత్తే పద్ధతిలో ఎంపిక జరుగుతుందని వివరించారు.
– 8లో

మొక్కలను సంరక్షించాలి