అంగరంగ వైభవంగా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర

May 14 2025 12:32 AM | Updated on May 14 2025 12:19 PM

● అంగ

అంగరంగ వైభవంగా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర

విశేష అలంకరణలో చిత్తూరు నడివీధి గంగమ్మ

చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరకు జనం పోటె త్తారు. గంగమ్మా.. మమ్మేలు మాయమ్మా..! అంటూ ప్రణమిల్లారు. కర్పూర హారతులు పట్టి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మ రికొందరు అంబళ్లు పోసి అమ్మవారిని వశం చేసుకున్నారు. కాగా బుధవారం జరిగే నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): చిత్తూరు గంగజాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. గంగోరి తల్లి పలు ప్రాంతాల్లో సింహ వానంపై ఆశీనులై భక్తులను కనువిందు చేశారు. భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. వినూత్న వేషధారణతో మొక్కులు తీర్చు కున్నారు. నడివీధిలో కొలువుదీరిన గంగమ్మతల్లికి తొలుత వంశపార్యపర్య ధర్మకర్తలు విశేష పూజలు చేసి జాతరను ప్రారంభించారు. గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి నైవే ద్యంగా అంబిలి, పిండి వంటలను సమర్పించారు. గిరింపేట, సంతపేట, దొడ్డిపల్లి, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి తదితర ప్రాంతాల్లో జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాగా చిత్తూరులో రెండో రోజు ఏటా అమ్మవారిని నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం 4 గంటల సమయంలో నడివీధి గంగమ్మ నిమజ్జనానికి బయలుదేరనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు అమ్మవారికి సారె సమర్పించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

గంగమ్మ సేవలో మంత్రి

చిత్తూరు నడి వీధిగంగమ్మను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దర్శించుకున్నారు. సారె సమర్పించి అమ్మవారి హారతి అందుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌, చుడా చైర్మన్‌ కఠారి హేమలత, నాయకులు పాల్గొన్నారు.

నేడు నిమజ్జనం.. ట్రాఫిక్‌ మళ్లింపు

చిత్తూరులో బుధవారం జరిగే గంగమ్మ నిమజ్జనానికి పోలీ సు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 2 నుంచి ట్రాఫిక్‌ మళ్లింపు ప్రక్రియను చేపట్టనుంది. భారీ వాహనాలను రెడ్డిగుంట జంక్షన్‌ మీదుగా ఇరువారం, కాణిపాకం జంక్షన్‌, మురకంబట్టు జంక్షన్‌, సాంబయ్యకండ్రిగ మీదుగా మళ్లించనున్నారు. వేలూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను రెడ్డిగుంట జంక్షన్‌ నుంచి కాణిపాకం మీదుగా మురకంబట్టు జంక్షన్‌, ఎల్‌జీబీ టవర్‌ మీదుగా ఆర్టీసీ బస్టాండుకు మళ్లించనున్నారు. ఇదే మాదిరిగానే పలమనేరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను కాణిపాకం క్రాస్‌ నుంచి ఆర్టీసీ బస్టాండుకు చేరుకునేలా చర్యలు చేపట్టారు. పలమనేరు నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలను ఇరువారం జంక్షన్‌ వరకు పరిమితం చేయనున్నారు. వేలూరు నుంచి వచ్చే ప్రైవేటు బస్సులు రెడ్డిగుంట జంక్షన్‌లో నిలుపుదల చేయనున్నారు. తిరుపతి –వేలూరు, బెంగళూరు వైపు నుంచి వచ్చే ప్రైవేటు బస్సులన్నీ మురకంబట్టు బైపాస్‌ నుంచి మళ్లించి ఇరువారం జంక్షన్‌ మీదుగా వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. అలాగే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లే వారు దర్గా సర్కిల్‌ మీదుగా చేరుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

గంగమ్మ సేవలో ఎస్పీ దంపతులు

చిత్తూరు నగరంలోని ప లు ప్రాంతాల్లో కొలువుదీరిని అమ్మవారిని ఎస్పీ మణికంఠ చందోలు దంపతులు దర్శించుకున్నా రు. వారికి జాతర నిర్వా హకులు కర్పూర హారతులు పట్టి సత్కరించా రు. గిరింపేటలో డిప్యూ టీ మేయర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రముఖులకు అమ్మవారి దర్శనం కల్పించి పసుపు, కుంకుమ అందించారు. సంతపేట వంశపారంపర్య ధర్మకర్త భూపేష్‌గోపీనాథ్‌ దగ్గరుండి ప్రముఖులకు స్వామి దర్శనం కల్పించారు. కొంగారెడ్డిపల్లిలో శంకర్‌ ప్రముఖులకు అమ్మవారి మాల, నిమ్మకాయ, ప్రసాదం అందించారు.

గంగమ్మకు సారె సమర్పణ

చిత్తూరు నగరంలోని కట్టమంచి, సంతపేట, శంకరయ్యగుంట, అగ్రహారం ప్రాంతాల్లో కొలువుదీరిన గంగమ్మకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి సతీమణి ఇందుమతి సారె సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శిఽంచి మొక్కులు తీర్చుకున్నారు. జాతర నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదం తదితరాలను అందజేశారు. కార్పొరేటర్‌ హరిణిరెడ్డి, నాయకులు అగ్రహారం సత్య, సంతపేట నారాయణ, మనోహర్‌రెడ్డి మనోజ్‌రెడ్డి, అంజలిరెడ్డి, అన్బు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర 1
1/4

అంగరంగ వైభవంగా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర

చిత్తూరు నడివీధి గంగమ్మ2
2/4

చిత్తూరు నడివీధి గంగమ్మ

 ప్రసాదం అందజేస్తున్న కార్పొరేటర్‌ హరిణిరెడ్డి3
3/4

విజయానందరెడ్డి సతీమణి ఇందుమతికి ప్రసాదం అందజేస్తున్న కార్పొరేటర్‌ హరిణిరెడ్డి

గంగమ్మ సేవలో ఎస్పీ దంపతులు4
4/4

గంగమ్మ సేవలో ఎస్పీ దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement