
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చౌడేపల్లె: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించిన సంఘటన శుక్రవారం పుంగనూరు మార్గంలోని చిన్న యల్లకుంట్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లె మండలం పొదలపల్లె సమీపంలోని ఓ రైతుకు చెంది మామిడితోటకు యానాది రెడ్డెప్ప(35) కాపలాగా ఉన్నాడు. అతనికి భార్య రాజేశ్వరి, ఐదుగురు పిల్లలు ఉన్నారు. గురువారం రాత్రి పెద్దయల్లకుంట్ల సమీపంలోని ఓ మామిడితోటలో కాపలాగా ఉన్న తన అక్క సిద్ధమ్మ వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న భార్యాపిల్లలతో కలిసి గురువారం రాత్రి భోజనం చేసి, తాను కాపలా ఉన్న మామిడితోట వద్దకు వెళ్లేందుకు రెడ్డెప్ప చౌడేపల్లె– పుంగనూరు మార్గంలోని పొదలపల్లె సమీపంలో రోడ్డుపైకి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని వాహనం ఈడ్చుకుని వెళ్లి, కొద్ది దూరంలోని పొదల చాటున పొలాల్లోకి పడేసి ఉడాయించారు. అటు వైపుగా వెళ్లే పాదచారులు గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అదుపుతప్పి లారీ బోల్తా
శ్రీరంగరాజపురం : అదుపుతప్పి ఆయిల్ ప్యాకెట్లు తరలిస్తున్న లారీ బోల్తా పడిన సంఘటన మండలంలోని గంగమ్మగుడి వద్ద చో టు చేసుకుంది. పోలీ సుల కథనం మేరకు.. చైన్నె నుంచి చిత్తూరుకు ఆయిల్ ప్యాకెట్ల లోడ్‌తో శుక్రవారం ఓ లారీ బయలుదేరింది. లారీ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిలోని శ్రీరంగరాజపురం మండలం ఆరిమాను గ్రామానికి సమీపంలోని గంగమ్మ గుడి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
జూద స్థావరాలపై దాడులు
9 మంది జూదరుల అరెస్టు
వెదురుకుప్పం : జూదస్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేసి, 9 మంది జూదరులను అరెస్టు చేసిన సంఘటన మండలంలోని జక్కదొన అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని జక్కదొన అటవీ ప్రాంతంలో కొంతమంది జూదం ఆడుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఇన్‌చార్జ్ ఎస్‌ఐ సుమన్ తన సిబ్బందితో కలసి జూద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. ఆ సమయంలో జూదం ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసి, రూ.15,830 స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌చార్జ్ ఎస్‌ఐ సుమన్ తెలిపారు. ఎవరైన జూదం ఆడిన, సారా కాసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి