
అంగరక్షకులకు అప్రమత్తత అవసరం
చిత్తూరు అర్బన్: ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల వద్ద అంగరక్షకులు (గన్‌మాన్)గా విధులు నిర్వర్తిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ ఆదేశించారు. గత మూడు రోజులుగా జిల్లాలోని అధికారులు, ప్రముఖులు, రాజకీయ నాయకుల వద్ద పనిచేస్తున్న అంగ రక్షకులకు ఇస్తున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ రాష్ట్ర డీఎస్పీ అంకారావుతో కలిసి ఎస్పీ ముగింపు సమావేశంలో మాట్లాడారు. అంగరక్షకులంటేనే బాధ్యతతో కూడుకున్న విధులుగా గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతీ ఒక్క ప్రముఖుడినీ కాపాడడమే బాధ్యతగా పనిచేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, సమయ పాలన, కమ్యునికేషన్స్‌పై కనీస అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో ఏఆర్ ఏఎస్పీ శివానందకిషోర్, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, ఆర్‌ఐ సుధాకర్ పాల్గొన్నారు.