
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్త దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: ౖవెఎస్సార్ సీపీ సానుభూతి పరులపై టీడీపీ కార్యకర్త దాడులు చేశాడు. పాత కక్షలతో ఇంటి అరుగుపై కూర్చున్న వ్యక్తిపై బులెట్ లో దూసుకెళ్లి, గుద్ది గాయ పరిచాడు. ఆపై కుటుంబసభ్యులపై దౌర్జన్యం చేసి, చితకబాది భయ బ్రాంతులకు గురి చేసిన ఘటన చిత్తూరు మండలం 36.గొల్లపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. చిత్తూరు మండలం 36.గొల్లపల్లికి చెందిన సుందరయ్య తన ఇంటి అరుగుపై కూర్చుని ఉన్నారు. ఇది గమనించిన టీడీపీకి చెందిన పవన్ బులెట్ పై అతివేగంగా అతని పైకి దూసుకొచ్చాడు. దీంతో సుందరయ్యకు గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ ఆ యువకుడు సుందరయ్య మామ వజ్రాలు మందడి వీపుపై ఇనుప వస్తువుతో చితకబాదాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రిలో చేరారు. మళ్లీ ఆ యువకుడు చిత్తూరులోని కొందరు అల్లరి మూకలను రప్పించి, బాధితుడి ఇంట్లోని మహిళలు, వృద్ధులపై దాడి చేశాడు. ఆ కుటుంబం ఎప్పుడు ఏం చేస్తారని భయపడుతోంది. కాగా నిందితుడు ఎన్నికల సమయంలో కూడా ఓ వ్యక్తిపై దాడిచేసి తలపై గాయపరిచాడు. దీనిపై కేసు కూడా నమోదైంది