
పలమనేరులో భారీ వర్షం
పలమనేరు: పలమనేరులో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. కొలమాసనపల్లి పంచాయతీ, దిగువమారుమూరు గ్రామానికి చెందిన రామచంద్ర ఇంటి పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఇంట్లో నిద్రిస్తున్న వారు హడలిపోయారు. భారీ వర్షం కారణంగా పలు పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. తీగ పంటలు సైతం నేలవాలిపోయాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
మొరవెత్తిన బొమ్మిదొడ్డి చెరువు
మండలంలోని బొమ్మిదొడ్డి చెరువు వర్షాలతో మొరవెత్తింది. మిగిలిన చెరువులకు కొంత మేర వర్షపునీరు చేరింది. కౌండిన్య నదిలోని చెక్‌డ్యామ్‌లకు సైతం వరదనీరు చేరింది. ఇదేవిధంగా మరో రెండ్రోజులు వర్షాలు పడితే మరిన్ని చెరువులకు నీరు చేరే అవకాశం ఉంది.

పలమనేరులో భారీ వర్షం

పలమనేరులో భారీ వర్షం