గవర్నెన్స్‌ను సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్‌న్స్‌లో పౌర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9552300009ను కేటాయించినట్టు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ 95523 00009 మనమిత్ర పేరుతో సేవ్ చేసుకొని ఆ నంబర్ కి హాయ్ అని సందేశం పంపి ప్రభుత్వ సేవలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. డీఎల్‌డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల భద్రతకు కిశోర వికాసం
గంగాధర నెల్లూరు : బాలికల భద్రతే కిశోర వికాసం లక్ష్యమని జిల్లా లీగల్ అడ్వైజర్ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలోని అప్పిరెడ్డికండిగ గ్రామంలో మంగళవారం అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికల సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, చైల్డ్ హెల్ప్ లైన్ నం.1098 తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డీసీపీఓ స్టాప్ షణ్ముగం, నెల్లేపల్లి మహిళా పోలీస్ మౌనిక, అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్మల, ప్రమీల, చిట్టెమ్మ, పావని పాల్గొన్నారు.
గవర్నెన్స్‌ను సద్వినియోగం చేసుకోండి


