అధైర్యపడొద్దు... వచ్చేది మన ప్రభుత్వమే
కుప్పంరూరల్: అధైర్య పడొద్దు... 2029లో వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతి కార్యకర్తకూ న్యాయం చేసే బాధ్యత నాది...అని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నాయకులతో అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన్ని కలిసి కుప్పం నాయకులతో సుధీర్ఘంగా చర్చించారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు, దాడులు ఎక్కువయ్యాయని కుప్పం నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదని, వచ్చేది మన ప్రభుత్వమే అని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తనది చెప్పారు. ఎవరెవరు అన్యాయం చేశారో వారిని గుర్తు పెట్టుకోవాలని, వారికి రెండింతలు తిరిగి ఇస్తామని చెప్పారు. అధికారులైనా, నాయకులైనా ఎవరినినైనా వదిలేదిలేదన్నారు. అధికారులు రిటైర్డ్ అయినా, నాయకులు సముద్రాలకు అవతల వెళ్లి దాక్కున్న తీసుకువచ్చి శిక్ష వేస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక ఇన్‌చార్జ్ స్థానికంగానే ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో దాడులకు గురైన వారిని ఒకసారి విజయవాడకు తీసుకురావాలని చెప్పినట్లు నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్మెల్సీ భరత్, సెంథిల్‌కుమార్, కుప్పం నియోజకవర్గ నాలుగు మండలాల నేతలు పాల్గొన్నారు.
కుప్పం సమస్యలు మాజీ సీఎం దృష్టికి..
బైరెడ్డిపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం నియోజకవర్గ ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులను కుప్పం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మొగసాల రెడ్డెప్ప మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో కుప్పం, రామకుప్పం మండలాలకు సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, సమస్యలను మాజీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
కుప్పం నేతలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


