
మేత బీడును కాపాడండి
ఎన్నో ఏళ్లుగా పశువులు, మేకలు, గొర్రెలు మేపుకుంటున్న భూమిని కొందరు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్‌ఆర్‌పురం మండలం, ఆర్‌ఆర్‌పురం ఎస్టీ కాలనీ వాసులు పే ర్కొన్నారు. ఈ మేరకు వారు కలెక్టర్‌కు సమస్యను వివరించారు. తమ గ్రామ పరిధిలో సర్వే నం.170లో 18/2లో ఉన్న భూమిని మోతుబారి రైతు కుటుంబీకులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విచారించి న్యాయం చేయాలని వారు కోరారు.
గుడి వద్ద మద్యం షాపు వద్దు
గుడి వద్ద ఉన్న మద్యం షాపును తొలగించాలని వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. తమ గ్రామంలో చర్చి, మాతమ్మ గుడికి సమీపంలో మద్యం షాపు ఉందన్నారు. ఆ దారిలో ఆలయాలకు వెళ్లే సమయంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు.

మేత బీడును కాపాడండి