
వరసిద్ధుడి సేవలో ఆర్టీఐ కమిషనర్
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారిని శనివారం రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ (ఆర్టీఐ) చావలి సునీల్‌కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారు లు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనం పలికి, ప్రసాదం, స్వామి వారి చిత్రపటం అందజేశారు.
అర్ధగిరి క్షేత్రంలో
పౌర్ణమి వేడుకలు రేపు
తవణంపల్లె: మండలంలోని అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ హనుమంతురావు తెలిపారు. ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అ లంకరణ, పూజలు నిర్వహిస్తామన్నారు. 11 గంటలకు ఆలయ మండపంలో స్వామివారికి సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. రాత్రి 7.30 గంటలకు ప్రాకారోత్సవం వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్కభజనలు, భక్తి కీర్తనల సంగీత కచేరి ఉంటుందన్నారు.
కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున స్వామివారికి అభిషేక పూజలు చేసి, భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శన సేవ క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు.
కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక రేపు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12 వ తేదీన కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లాధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

వరసిద్ధుడి సేవలో ఆర్టీఐ కమిషనర్

వరసిద్ధుడి సేవలో ఆర్టీఐ కమిషనర్