
అవకతవకలు జరిగితే కఠిన చర్యలు
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దర్శన సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆలయ ఈఓ పెంచలకిషోర్ హెచ్చరించారు. వరసి ద్ధి వినాయకస్వా మి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం అన్ని విభా గాల అధికారులు, సిబ్బంది, అర్చకులతో ఆయన సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అందరూ అ కింత భావంతో పనిచేయాలన్నారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. దర్శ నార్థం సిబ్బందికి ఎవరైనా తెలిసిన వ్యక్తులు వస్తే కచ్చితంగా టికెట్లు తీసుకోవాలన్నా రు. దర్శన విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయన్నా రు. ఆలయ అదాయ పెంపు విషయంలో ప్రతి ఒక్కరూ దేవస్థానానికి సహకరించాలన్నారు. ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ ప్రసాద్, సూపరింటెండెంట్ కోదండపాణి పాల్గొన్నారు.
ఇక బయోమెట్రిక్‌తో పత్రాల అందజేత
చిత్తూరు కార్పొరేషన్: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు ఇక బయోమెట్రిక్ అయ్యాక ఇవ్వాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణన్ మురుగన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాక్షిగా బయోమెట్రిక్ పెట్టిన వారికి తతంగం ముగిశాక బయోమెట్రిక్ పెట్టించుకుని పత్రాలు అందజేసేవారు. ప్రస్తుతం అలా కాకుండా క్రయ, విక్రయదారుల్లో ఎవరైనా ఒకరు కచ్చితంగా బయోమెట్రిక్ పెడితేనే పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో సబ్‌రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.