
ఇక జగమర్ల గ్రామానికి మహర్దశ ●
● దార్థి అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా అభివృద్ధి ● జిల్లాలో పలమనేరు మండలంలోని జగమర్ల ఎంపిక ● యానాదుల జీవన ప్రమాణాల పెంపునకు కేంద్రం చర్యలు ● విద్యాభివృద్ధికి ప్రత్యేక పాఠశాలలు, ఉపాధికి పెద్దపీట
●
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజన గ్రామాల అభివృద్ధి కల సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దార్థి అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం అందుకు ఊపిరి పోయ నుంది. ఈ పథకం అమలుకు పలమనేరు మండలంలోని జగమర్ల ఎంపికైంది. దీంతో ఆ పల్లె ప్రగతి పథంలో నడవనుంది.
ఆనందంగా ఉంది
ఎక్కువగా ఎస్టీలున్న తమ గ్రామం జనజాతీయ గ్రా మ్‌గా ఎంపిక కావడం ఆ నందంగా ఉంది. ఆ నిధుల తో మా గ్రామం బాగుపడుతుందని అనుకుంటున్నాం. ఇక్కడున్న యానాదుల అభ్యున్నతి విద్యతోనే సాధ్యమని నమ్ముతున్నా.
– విజయ్, సర్పంచ్,
జగమర్ల, పలమనేరు మండలం
6 కిలోమీటర్ల రోడ్డు వేస్తే అభివృద్ధి
మా గ్రామస్తులు పండించిన పంటను బంగారుపాళెం, పుంగనూరు, చౌడేపల్లి, సోమలకు తరలించాలంటే పలమనేరు హైవేలోకెళ్లి బంగారుపాళెం వెళ్లాలి. సోమల, చౌడేపల్లికి వెళ్లాలంటే పలమనేరుకు వెళ్లి చౌడేపల్లి, పుంగనూరు చుట్టుకుని వెళ్లాల్సివస్తోంది. అదే తుంబకుప్పం రోడ్డు పనులు జరిగితే రైతులకు చాలా మేలుగా జరుగుతుంది. – రెడ్డెప్పరెడ్డి,
జగమర్ల, పలమనేరు మండలం
పలమనేరు: అభివృద్ధిలో వెనుకబడి ఎక్కడో విసిరేసినట్టున్న గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్రం నడుం బిగించింది. అన్ని గ్రామాలతో స మానంగా గిరిజన గ్రామాలను సైతం అభివృద్ధి చేసి, గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దార్థి అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని గత ఏడాది గాంధీ జయంతి రోజున ప్రారంభించింది. దేశంలోని 63 వేల గిరిజన గ్రామాల్లో ఐదు కోట్ల మందికి లబ్ధి చేకూరేలా రూ.80 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. చిత్తూరు జిల్లాలోని జగమర్ల, మొగిలిపొదరేవులు, కల్లిగుట్ట గ్రామాలను పరిశీలించి, వీటిలో అత్యంత వెనుకబడిన పల మనేరు మండలంలోని జగమర్ల గ్రామాన్ని తొలిదశలో ఎంపిక చేసినట్టు జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి మూర్తి తెలిపారు.
పట్టి పీడిస్తున్న రోడ్డు సమస్య ఇదీ..
దేవళంపెంట(యానాదికాలనీ) నుంచి తుంబకుప్పం గ్రామానికి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే. ప్రస్తుతానికి ఈ రహదారి మట్టిరోడ్డుగా ఉంది. ఈ మార్గంలో వాహనా లు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్డును బాగు చేసి, తారు రోడ్డుగా మార్చితే పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బంగారుపాళెం, తవణంపల్లె, సోమల మండలాలకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే పీలేరు, పూతలపట్టు, తవణంపల్లె, సదుం, సోమల, చౌడేపల్లెకు వెళ్లేందుకు జగమర్ల గిరిజనులకు అనుకూలంగా ఉంటుంది. ఇక పలమనేరు, బంగారుపాళెం, తవణంపల్లె, సోమల, పెద్దపంజాణి మండలాలలోని ఆరు మారుమూల అటవీ గ్రామాలకు రాకపోకల సౌకర్యం కలుగుతుంది.
గ్రామంలో ఏమి చేస్తారంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధుల ద్వారా గ్రామంలో విద్యకు పెద్దపీట వేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఉపాధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనుంది. గ్రామంలో ఎక్కువగా చేసే పనులను గుర్తించి, వాటిని పెంచి జీవనోపాది పెంచే కార్యక్రమాలు చేపట్టనుంది. గిరిజన కార్పొరేషన్ ద్వారా అటవీ ఉత్పత్తుల అమ్మకాలు, పాడి పరిశ్రమ అభివృద్ధిలాంటివి ఉంటాయి.

ఇక జగమర్ల గ్రామానికి మహర్దశ ●

ఇక జగమర్ల గ్రామానికి మహర్దశ ●