
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
చౌడేపల్లె : వైఎస్సార్‌సీపీ, మమ్మలను నమ్ముకొన్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం..ఎవరూ అధైర్యపడకండి అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం చౌడేపల్లె మండల పర్యటనలో భాగంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకొంటున్న పార్టీ కార్యకర్త బయ్యప్పల్లెకు చెందిన జగ్జీవన్‌రెడ్డిను పెద్దిరెడ్డి పరామర్శించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తలు, నేతలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పడిన కష్ట నష్టాలు తెలుసని రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు దామోదరరాజు, వైస్ ఎంపీపీలు నరసింహులు యాదవ్, సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి తదితరులున్నారు.
కార్యకర్తలు, నేతలతో ఆత్మీయ పలకరింపు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి