
చైర్మన్ గిరి.. వరించేదెవరినో?
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ పదవి ఆశావహులను ఊరిస్తోంది. ఎవరికి వారు తమకే పదవి వ స్తుందని, ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా రు. కూటమి సర్కారు మాత్రం ఎటూ తేల్చ కుండా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. దీంతో ఆ కుర్చీ ఎవరికి దక్కుతుందోనని ద్వితీయ శ్రేణి కూటమి నేతలు వేచి చూస్తున్నారు.
కాణిపాకం: అతిపెద్ద ఆలయాల్లో ఒకటైనా వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అర్థం కాని పరిస్థితి. పాలకమండలి ప్రకటించే విషయంలో అదిగో..ఇదిగో అంటూ ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. ఆలయ పాలకమండలి చైర్మన్ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. మాజీ చైర్మన్‌కు మళ్లీ పట్టమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆర్థికంగా మంచి పలుకుబడి ఉన్నవాళ్లకే ఇస్తే ఆలయాభివృద్ధికి దోహద పడతారనే వాదనలు మరోవైపు గట్టిగా వినిపిస్తున్నాయి. కొత్తగా ఎస్సీ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది.
చతుర్ముఖ పోటీ
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు ఉన్న పాలక వర్గం రాజీనామా చేసింది. అప్పటి నుంచి కొత్త పాలక వర్గం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయ మాజీ చైర్మన్ మణినాయుడు, కూటమి నేతలు పూర్ణచంద్ర, మధుసూదన్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు కుర్చీ కోసం పోటీపడుతున్నారు. ఈ తరుణంలో మళ్లీ తానే చైర్మన్ అంటూ మణినాయుడు బహిరంగంగానే అందరికీ చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, కొందరు నేతల మద్దతు ఉండడంతో మణినాయుడుకే చైర్మన్ పదవి ఇస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చైర్మన్ మణినాయుడుకే ఇవ్వాలని కొందరు ప్రతిపాదించారు. అయితే అధిష్టానం ఒక్క మణినాయుడు పేరు కాదు.. ఆయనతోపాటు మరో ముగ్గురు, నలుగురు పేర్లు ఇవ్వాలని చెప్పింది. దీంతో ఆ నలుగురి పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. ఆ నలుగురిలో మణినాయుడు తరువాత చైర్మన్ పదవి కోసం పూర్ణ గట్టిగా పోటీపడుతున్నారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
కాణిపాక దేవస్థానం
కాణిపాకం పాలకమండలి ఏర్పాటులో జాప్యం?
అదిగో..ఇదిగో అంటూ నాన్చుతున్న ప్రభుత్వం
నలుగురి మధ్య తీవ్ర పోటీ
ఆశావహుల్లో ఉత్కంఠ
ఆలస్యం వెనుక ఆంతర్యమేమిటో?
కాణిపాకం దేవస్థాన చైర్మన్ పదవి ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది. ఆలస్యం వెనుక ఆంతర్యం ఏమిటోనని ఆశావాహులు, ఉభయకర్త లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మణినాయుడికి ఇస్తారా? ఇవ్వరా అనే అను మానాలు పుట్టుకొస్తున్నాయి. మరో ముగ్గురిలో ఆర్థి కంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఇస్తే బా గుంటుందని పలువురు భావిస్తున్నారు. ఇక కొత్త గా ఎస్సీ సామాజిక వర్గానికి కట్టబెడతారని మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రతిపాదనను అధిష్టానం పరిశీలనలో పెట్టి నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విష యంపై ప్రజాప్రతినిధి కూడా సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది నిజం కాదని.. ఇక్కడ ఎీస్సీ సామాజిక వర్గం మాటే ఉండదని పలువురు ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. ఈ గందరగోళం నడుమ స్థానికంగా ఉన్న వ్యక్తిని కాదని బయట వ్యక్తులకు ఇస్తారని కొందరు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలో కేటాయించిన పలు నామినేటెడ్ పదవులు ఆశావహులకు కాకుండా ఊహించని వ్యక్తుల ఇవ్వడం కూడా కాణిపాకం చైర్మన్ పదవి ఆశిస్తున్న ఆశావహుల్లో గుబులు పుట్టిస్తోంది.

చైర్మన్ గిరి.. వరించేదెవరినో?

చైర్మన్ గిరి.. వరించేదెవరినో?

చైర్మన్ గిరి.. వరించేదెవరినో?

చైర్మన్ గిరి.. వరించేదెవరినో?