కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు కిక్కిరిశారు. సెలవులు కావడంతో భక్తులు స్వామి దర్శనార్థం ఉదయం నుంచే క్యూ కట్టారు. ఉచిత, శ్రీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శన క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. క్యూలో ఉన్న భక్తులకు అల్పాహారం అందజేశారు. ప్రముఖులు వచ్చినా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన సేవలు కల్పించారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
ఆన్‌లైన్‌లో పోస్టుల మెరిట్ జాబితా
చిత్తూరు రూరల్ (కాణిపాకం):జిల్లా వైద్య విధా న పరిషత్‌లో పలు పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను ఆన్‌లైన్ ఉంచినట్లు డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి తెలిపారు. ఎంపికై న వారి కి మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులకు ఫోన్‌కాల్ ద్వారా తెలియజేశామని, కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు.
జనారణ్యంలోకి దుప్పి
వెదురుకుప్పం : మండలంలోని పచ్చికాపల్లంలో ఆదివారం సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ దుప్పి వచ్చింది. రక్త గాయాలతో ఉండగా గమనించిన స్థానిక రైతు ఇంటికి తీసుకెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి దుప్పిని స్వాధీనం చేసుకొని చికిత్స చేయించి అడవిలో వదిలారు.
కిక్కిరిసిన కాణిపాకం


