
పంచలోహ విగ్రహం చోరీ
పాలసముద్రం : మండలంలోని వెంగళరాజుకుప్పం పంచాయతీ, కొత్తూరు గ్రామంలో వెలసిన గంగమ్మగుడిలో పంచలోహ విగ్రహం తోపాటు హుండీలో నగదు, మైక్‌సెట్ చోరీ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చిత్తూరు– బలిజకండ్రిగ జాయతీ రహదారి కొత్తూరు గ్రామ సమీపంలో గంగమ్మ గుడిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గర్భగుడి తలుపులు పగులగొట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలైన్ కట్ చేసి డీవీఆర్‌తోపాటు పంచలోహ విగ్రహాన్ని చోరీ చేశారు. అలాగే హుండీలో సుమారు రూ.20 వేల వరకు నగదు, మైక్‌సెట్ తీసుకెళ్లారు. ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిత్తూరు నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.

పంచలోహ విగ్రహం చోరీ