
ఈతకు వెళ్లి బాలుడి మృతి
శ్రీరంగరాజపురం : ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని పి.వి.పురం గ్రామంలో చోటుచేసుంది. స్థానికుల కథనం.. పి.వి.పురం గ్రామానికి చెందిన ఎస్.సురేష్, నందిని దంపతుల రెండవ కుమారుడు ఎస్.కార్తీక్ (8) మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి గ్రామ సమీపంలో ఉన్న కుశస్థలి నదిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత నేర్చుకుంటూ అకస్మాత్‌గా నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కార్తీక్‌ను బయటకు తీశారు. అప్పటికే కార్తీక్ మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా కార్తీక్ తల్లి నందిని ఇటీవలే మృతి చెందారు. బంధువుల ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కార్వేటినగరం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొల్లాగుంట ఏఎడబ్ల్యూ సమీపం చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని కొటార్వేడు గ్రామానికి చెందిన చిన్నబ్బ కుమారు ఎ.గిరిబాబు(29), తమిళనాడులోని తిరుత్తణికి చెందిన దివ్య(మౌనిక)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. అనారోగ్యం కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లింది. మంగళవారం సాయంత్రం భార్యను చూసేందుకు గిరిబాబు తిరుత్తణికి ద్విచక్ర వాహనంలో బయల్దేరాడు. మార్గమధ్యంలో కొల్లాగుంట ఏఎడబ్ల్యూ సమీపం చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై పుత్తూరు నుంచి చిత్తూరుకు ఇనుప కమ్మీల(స్టీల్) లోడ్డుతో వెళ్తున్న లారీ గిరిబాబును వెనుక నుంచి ఢీకొట్టింది. ఆపై సుమారు పది అడుగుల వరకు లాక్కెళ్లింది. గిరిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య మూడు నెలల గర్భిణిగా ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఈతకు వెళ్లి బాలుడి మృతి