ట్రస్టులకు విరాళం | - | Sakshi
Sakshi News home page

ట్రస్టులకు విరాళం

May 10 2025 8:04 AM | Updated on May 10 2025 8:04 AM

ట్రస్

ట్రస్టులకు విరాళం

కాణిపాకంలోని నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు దాతలు శుక్రవారం నగదు విరాళాలు అందజేశారు.

శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు పోలీసు శాఖలో జరుగుతున్న పరిణామాలపై ఆ శాఖలో విస్తృత చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఏ ఇద్దరు ఖాకీలు ఒక చోట కలిసినా ఇటీవల పోలీసుశాఖలో చోటు చేసుకుంటున్న బదిలీలపై మాట్లాడుకుంటున్నా రు. తాజాగా స్పెషల్‌ బ్రాంచ్‌లో సీఐగా పనిచేస్తున్న భాస్కర్‌, మోటారు ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (ఎంటీఓ) భాస్కర్‌పై బదిలీ వేటు పడింది. వీరిద్దరూ ఏదో ఒక స్టేషన్‌కు బదిలీ అయివుంటే పెద్దగా చర్చ నడిచేదికాదు. కానీ ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకపోవడం గురించే ఏవేవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్‌బీ సీఐ ఎన్‌.భాస్కర్‌ను ఏకంగా కర్నూల్‌ రేంజ్‌ వేకెంట్‌ రిజర్వుకు (వీఆర్‌), ఎంటీఓ జి.భాస్కర్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఆద్యంతం వివాదాస్పదం..

ఎంటీఓ.. జిల్లా పోలీసుశాఖలో పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టనే చెప్పాలి. పోలీసుశాఖలోని వాహనాల పర్యవేక్షణ, వీటికి ఉపయోగించే ఇంధనం, పోలీసు వాహనాలకు డ్రైవర్ల కేటాయింపు వంటి పనులను చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇపుడా పరిస్థితి లేదు. ఎంటీఓ అంటేనే పోలీసు ఉన్నతాధికారిని కాకా పట్టడం, ఏయే సబ్‌–డివిజన్‌లో ఇన్‌స్పెక్టర్‌ ఎవర్ని కలుస్తున్నాడు..? ఎస్‌ఐ సెలవు పెట్టి ఎక్కడికి వెళుతున్నాడు..? డీఎస్పీ పనితీరు ఎలా ఉంది..? లాంటి విషయాలపై ఉన్నతాధికారులకు చాడీలు చెప్పడం, స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బందిపై ఆరోపణలు చేయడం, యూనియన్‌ నాయకులపై పెత్తనం చెలాయించడం లాంటి పనులపైనే దృష్టి పెడుతున్నారు. తల్లిలాంటి ఏఆర్‌ విభాగంలో ఏఎస్పీల నుంచి డీఎస్పీలు, తోటి ఆర్‌ఐలు ఉన్నతాధికారులనే ఎదిరించే స్థాయికి వెళ్లిపోయారు. ఇక ఏఆర్‌ అధికారులు వాహనాలు అడిగితే అమర్యాదగా మాట్లాడడం, పైగా చోరీ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను తన వద్దకు తెప్పించుకోవడం, కుటుంబ సభ్యుల్ని అందులో ఎక్కించుకుని రోడ్లపై తిరుగుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీటిపై ఏఆర్‌తోపాటు లా అండ్‌ ఆర్డర్‌ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు సమాచారం. ఇదికాదన్నట్లు మొత్తం ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌) విభాగం తన కనుసన్నల్లోనే పనిచేయాలన్నట్లు ‘సూపర్‌ బాస్‌’గా చెలామణి అవుతూ ఓ వెలుగు వెలిగిన సందర్భం.

చిత్తూరులోని

పోలీసు ఏఆర్‌ కార్యాలయం

– 12లో

– 12లో

న్యూస్‌రీల్‌

పంచాయతీలకు

రూ.1.38 కోట్లు విడుదల

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలోని పంచాయతీలకు రాష్ట్ర గ్రాంట్‌గా తొలి త్రైమాసికానికి రూ.1.38 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తల సరి ఆదాయం(పర్‌క్యాపిటా) కింద రూ.15,05, 785, వృతి పన్ను రూ.36,33,196, సర్పంచుల గౌర వేతనాలకు రూ. 86,95,992, లైబ్రరీ గ్రాంటు రూ.673 కలిపి రూ.1.38 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఆయా పంచాయతీల ఖాతాల్లో ఈ నెల 12, 13వ తేదీల్లో జమ చేయనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.

గ్రేడ్‌ 3 పంచాయతీ కార్యదర్శులకు

ఉద్యోగోన్నతి

జిల్లాలోని 26 మంది గ్రేడ్‌ –3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌– 2 పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిని ఖాళీలున్న గ్రేడ్‌ –2 గ్రామ పంచాయతీల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు.

పత్రికా స్వేచ్ఛ హరణ

ఆటవిక చర్య

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం ఆటవిక చర్య అని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సాక్షి దినపత్రిక సంపాదకుడు ఆర్‌.ధనంజయరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వమండా పోలీసులు సోదాలు చేయడం నీతిమాలిన చర్య అని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగమైన ఒక స్తంభాన్ని కూల్చేయాలనుకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే సాక్షి దినపత్రికపై కక్ష సాధింపు చర్యలకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా రాష్ట్ర గవర్నర్‌ చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఎస్పీపై కోపమే కారణమా?

చిత్తూరు స్పెషల్‌ బ్రాంచ్‌లో బదిలీలు అంటే ‘బాస్‌’ కల్పించుకుంటే తప్ప జరగదు. అలాంటిది బాస్‌కు చెప్పా పెట్టకుండా ఓ సీఐ స్థాయి అధికారికి ఇక్కడి నుంచి తప్పించడం, అదే బాస్‌కు నీడలా నడిచిన ఎంటీఓపై బదిలీ వేటు వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికితోడు ‘ప్రత్యేక విభాగం’లో పనిచేసే మరో అధికారి ఇతర జిల్లాలో పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. చిత్తూరు ఎస్పీ మణికంఠ కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా ప్రవర్తించడం పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలకు నచ్చడంలేదు. ఈయన్ని బదిలీ చేయాలని కూటమి నేతలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఒకరు జూన్‌లో ఎస్పీ బదిలీ అవుతారంటే, 15 రోజుల్లో వెళ్లిపోతారని మరొకరు ప్రచారం చేస్తున్నారు. ముందు ఎస్పీ మార్కు వేసుకున్న అధికారులను ఇప్పటి నుంచే తప్పించడానికి కూటమి నేతలు కంకణం కట్టుకున్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది.

జిల్లా పోలీసు శాఖలో ఏదో జరిగిందని.. అసలేమి జరుగుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల మూకుమ్మడి పోలీసుల బదిలీలు.. తాజాగా ఎస్బీ సీఐ, ఎంటీఓల బదిలీ జరగడం.. పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై పోలీసులు గుసగుసలాడుతున్నారు. ఏమి జరుగుతుంది.. ఎందుకిలా జరుగుతుంది.. అన్న చర్చ నడుస్తోంది.

స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ.. ఎంటీఓపై బదిలీ వేటు

ఇద్దరికీ పోస్టింగులు ఇవ్వని యంత్రాంగం

బదిలీలపై చిత్తూరు పోలీసుశాఖ సర్వత్రా చర్చ

‘సూపర్‌ బాస్‌’గా దూసుకెళ్లడమే కారణమా?

దారి తప్పిన ఎస్‌బీ..

ఇక పోలీసుశాఖలో ఎస్పీ తరువాత కీలకమైన విభాగం స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ). జిల్లాలో స్టేషన్ల పనితీరు ఎలా ఉంది.? ఎక్కడ ఎలాంటి సమస్యలున్నాయి? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు ఎవరు..? రాజకీయ నాయకులతో సమస్యలొస్తే తీసుకునే చర్యలపై ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే విషయాలను ఎప్పటికప్పుడు ఎస్పీకి చేరవేయడమే ఎస్బీ ప్రధాన కర్తవ్యం. కానీ ఇటీవల కాలంలో పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో అధికారపార్టీ నేతలు నిర్వహిస్తున్న పేకాట క్లబ్బుల్లో వాటాలు, అక్రమ గ్రానైట్‌ తరలింపులో మామూళ్లు, కబేళాలకు తరలించే పశువుల లారీల్లో చిలక్కొట్టుడు లాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో ఏం జరిగినా కుర్చీ వేసుకుని మరీ కూర్చుని వేలు పెడుతున్నారని, ఎస్‌బీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కూటమి పార్టీ ఎమ్మెల్యే బంధువును అక్కడి నుంచి తప్పించి.. తన అనుచరుడికి పోస్టింగ్‌ ఇప్పించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఓ దశలో ఎస్‌బీ కూడా ‘సూపర్‌బాస్‌’గా వ్యవహరించడం చాలా మంది అధికారులకు మింగుడుపడలేదు. వీటిపై ఏకంగా అధికారపార్టీ ఎమ్మెల్యే డీఐజీకి ఫిర్యాదు చేయడంతో వేటుపడినట్లు సమాచారం.

ట్రస్టులకు విరాళం
1
1/2

ట్రస్టులకు విరాళం

ట్రస్టులకు విరాళం
2
2/2

ట్రస్టులకు విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement