
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
గుడిపాల : డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. బెంగుళూరు నుంచి గుడిపాల మండలంలోని కొత్తకోట గ్రామానికి కారులో అదే గ్రామానికి చెందిన వారు వెళ్తున్నారు. బుధవారం తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కుప్పిగానిపల్లె గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా భయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు