
కాపుగాసి..
రోగులకు మెరుగైన వైద్యం
ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి సుధారణి ఆదేశించారు.
చిత్తూరు మార్కెట్లో ధరలు రకం కిలో ధర రూ. బెనీషా : 30 చందూర : 11-20 అల్పోన్సో : 25 తోతాపురి : 8 రాలిపోయిన తోతాపురి : 4-6 తమిళనాడు క్రిష్ణగిరి మార్కెట్లో.. రకం కిలో ధర రూ. తోతాపురి : 10-15 బెనీషా : 30-35 చందూర : 15-25 అల్పోన్సో : 30 రాలిపోయిన తోతాపురి : 8
పకడ్బందీగా పది సప్లిమెంటరీ
...‘ఆడ’నే చంపేస్తాం!
చిత్తూరు నగరం లింగనిర్ధారణకు అడ్డాగా మారింది. అధికారుల మధ్య సమన్వ యలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
శుక్రవారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2025
జిల్లాలో కూటమికి చెందిన గుజ్జు పరిశ్రమలు మామిడి రైతులకు షాకిస్తున్నాయి. అధిక ధరకు కాయలు కొనుగోలు చేసి తక్కువ ధరకు తెచ్చినట్టు విషప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం కోత దశకు వచ్చిన కాయలను కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయాలని కుయుక్తులు పన్నుతున్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లోని రేట్లను బూచీగా చూపి రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. రోజురోజుకీ మామిడి ధరలు తగ్గించేస్తూ అన్నదాతను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఈ విషప్రచారంపై కూటమి ప్రభుత్వం స్పందిస్తుందో.. లేదా రైతులను నట్టేట ముంచేసి నేతలకు వత్తాసు పలుకుతుందో వేచి చూద్దాం మరి!
చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలో 56 వేల హెక్టార్ల మేర మామిడి సాగవుతోంది. మొత్తం 54,7320 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చేది. అయితే ఈ సారి అన్ని రకాలు కలిపి 6,45,234 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావొచ్చని అధికారుల అంచనా. ఇందులో టేబుల్ రకం 16,105 హెక్టార్లకు గాను 1,45,960 మెట్రిక్ టన్నులు, తోతాపురి 39,895 హెక్టార్లకు 6,45,234 టన్నుల వరకు రావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం టేబుల్ రకాలు కోతకొచ్చాయి. కాయలు కోసి రైతు మార్కెట్‌కు చేరుస్తుండగా.. అక్కడి రేట్లు చూసి దిగాలు చెందుతున్నారు.
భారీగా దిగుమతి
గత నెల నుంచి జిల్లాలో కొన్ని గుజ్జు పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. కేరళ నుంచి అల్పోన్సో రకం కాయలను దిగుమతి చేసుకుని గుజ్జు తయారీని ప్రారంభించాయి. మొదట్లో రోజుకు 90 టన్నుల వరకు దిగుమతి చేసుకునేవి. ఇప్పుడు ఈ రకం కాయలు 150 టన్నులకు పైగా దిగుమతి చేసుకుయింటున్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి తోతాపురి రకం కాయలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాయి. అక్కడ రాలిపోయిన కాయలను కూడా వదలడం లేదు. విజయవాడలో తోతాపురి కేజీ రూ.11కు కొనుగోలు చేసి ఇక్కడ రూ.7, రూ.8కే కొనుగోలు చేశామని కొన్ని గుజ్జు పరిశ్రమలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదంతా కూటమి పార్టీకి చెందిన పరిశ్రమదారులు చేస్తున్న విషప్రచారమేనని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రైతుల కష్టాన్ని జ్యూస్‌లాగా పిండేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రికి మంచి ఆఫర్ ఇచ్చి మామిడి ఫలాన్ని దోచుకునేందుకు కుట్రపన్నినట్టు చెబుతున్నారు.
రైతుల్లో గుబులు
గతంలో కంటే ఈసారి మామిడి దిగుబడి పర్వాలేదనిపిస్తోంది. కొన్ని చోట్ల మంచి దిగుబడి కూడా వస్తోంది. కాయలు కూడా నాణ్యవంతంగా ఉన్నాయి. టేబుల్ రకాలతోపాటు తోతాపురి కూడా మంచి సైజు వచ్చింది. తోతాపురి పది రోజుల్లో కోత కోసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో మామిడి ధరలు ఆరంభంలోనే తగ్గించేయడంతో పలువురు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరో వైపు పల్ప్ ఎగుమతుల ప్రభావం, యుద్ధాలు, బ్యాంకు రుణాలు, ఇతరత్రా సమస్యలను సాకుగా చూపిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
మామిడి రైతులను అయోమయానికి గురిచేస్తున్న గుజ్జు పరిశ్రమలు
బయట మార్కెట్లో తక్కువ ధరకు తెచ్చినట్టు విష ప్రచారం
అదే ధరకు ఇక్కడి కాయలు కొనుగోలు చేయాలని పన్నాగం
కోతకు రాకముందే కూటమి నేతల కొత్త ప్రయోగం
గందరగోళానికి గురవుతున్న అన్నదాతలు
జిల్లా సమాచారం
మామిడి హెక్టార్లు దిగుబడి అంచనా
రకం మెట్రిక్ టన్నుల్లో
తోతాపురి 39,895 49,9274
నీలం 5,818 64,991
అల్పోన్సో 3,127 26,404
బేనీషా 3,895 28,867
మల్లిక 1,740 13,919
ఇతర రకాలు 1,526 11,779
అన్యాయం చేయొద్దు
ఎకరాకు పైగా మాకు మామిడితోట ఉంది. అప్పు చేసి ప్రతిసారీ పంటను కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ సారి పంట బాగానే వచ్చింది. గాలీవానకు కొంత నష్టమైంది. ఉన్న పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాం. ఈ సమయంలో రేట్లు తగ్గించేయడం విడ్డూరంగా ఉంది. ధర నిర్ణయం విషయంలో రైతులకు మేలు చేకూరాలి. ఆ రకంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
–వెంకటేష్, ఎస్‌ఆర్‌పురం మండలం
రైతులకు గిట్టుబాటయ్యేలా చూస్తాం
తోతాపురి రకం కోతకొచ్చేందుకు 10, 15 రోజులు పడుతుంది. బయట జిల్లాలకు సంబంధించిన కాయలను కొనకూడదని ఫ్యాక్టరీ యజమానులకు చెప్పాం. వాళ్లు కూడా సహకరిస్తున్నారు. ఈ సారి దిగుబడి, నాణ్యత బాగుంది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తాం. రైతులను ఇబ్బంది పెట్టించాలని చూస్తే కచ్చితంగా చర్యలు చేపడుతాం.
– మధుసూదన్ రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, చిత్తూరు

కాపుగాసి..

కాపుగాసి..

కాపుగాసి..

కాపుగాసి..

కాపుగాసి..

కాపుగాసి..

కాపుగాసి..

కాపుగాసి..