చంద్రగిరి వద్ద డివైడర్‌ను డీకొట్టిన బస్సు | Road accident to Tirumala RTC bus at Chandragiri | Sakshi
Sakshi News home page

చంద్రగిరి వద్ద డివైడర్‌ను డీకొట్టిన బస్సు

May 12 2025 12:39 AM | Updated on May 12 2025 5:25 AM

Road accident to Tirumala RTC bus at Chandragiri

చంద్రగిరి: తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి తమిళనాడు­లోని వేలూరు నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగ­రాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి కల్వ­ర్టును ఢీకొట్టింది. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. దాదాపు 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్‌ రాజారెడ్డి, కండక్టర్‌ లక్ష్మీనారాయణ, ప్రయాణికులు శ్రావణ్‌కుమార్, దీపారాణి, నితీశ్‌కుమార్, అక్షయ్‌కుమార్, తిరు­సడై, తేజస్విని, రామ్‌లక్ష్మి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరికొందరిని చంద్రగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement