ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి! | - | Sakshi
Sakshi News home page

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

May 17 2025 6:29 AM | Updated on May 17 2025 6:29 AM

ఎవరిక

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

పలమనేరులో భారీ వర్షం
పలమనేరు నియోజకవర్గంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
– IIలో
వైభవంగా సుమంగళి సౌభాగ్య మహోత్సవం

రసవత్తరంగా కుస్తీపోటీలు

చిత్తూరులోని మెసానికల్‌ మైదానంలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025

మదనపల్లె: ఆసియా ఖండంలో అతిపెద్ద, 31 ఎత్తిపోతలు కలిగిన ప్రాజెక్టు హాంద్రీ–నీవా. ఈ ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్‌ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆవులపల్లె. 3.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌ కింద 20 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఇంత గొప్ప రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టలేని టీడీపీ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టడాన్ని జీర్ణించుకోలేక పోయింది. అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలో 120 చెరువులకు నీటినందించి, 15 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 20 వేల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంతో రెండు టీఎంసీల సామర్థ్యంతో ముదివేడు రిజర్వాయర్‌ పనలు చేపట్టారు. చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో నేతికుంటపల్లె రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టి దీనికింద 5 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 10 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ పనులు పూర్తయితే వీటి నిర్మాణం కోసం కృషి చేసిన పెద్దాయన పేరు చిర స్థాయిగా నిలిచిపోతుందని భావించారు. వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరగుతుందని కుట్రపన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని భయపడిపోయారు. అందుకే దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు కేసులు వేసి అడ్డుపుల్ల వేశారు.

టెండర్‌లో రూ.64 కోట్ల ఆదా

మూడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.2,144.50 కోట్లు మంజూరు చేయగా టెండర్ల నుంచి ఒప్పందం వరకు అన్ని పారదర్శకంగానే జరిగాయి. ఇందులో నిర్మాణాలకు రూ.1,529.37 కోట్లు, భూసేకరణ, ఇతరా పనులకు రూ.615.13 కోట్లు కేటాయించారు. మూడు రిజర్వాయర్లను ఒకేపనిగా రూ.1,554,21,60,649 అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో ఎన్‌ఈసీఎల్‌, ఆర్‌ఆర్‌సీఐఐపీఎల్‌ జాయింట్‌ వెంచర్‌, మేఘా ఇంజినీరింగ్‌ వర్క్‌, హెఈఎస్‌ ఇన్‌ఫ్రా ప్రైయివేట్‌ లిమిటెడ్‌ సంస్థలు పాల్గొన్నాయి. అంచనా కంటే అధికంగా రూ.1,618.72 కోట్లకు టెండర్లు వేయగా, దీనిపై ప్రభుత్వం రివర్స్‌ టెండర్‌ నిర్వహించగా జాయింట్‌ వెంచర్‌ సంస్థ రూ.1,553.96 కోట్లతో టెండర్‌ వేయడంతో ప్రభుత్వానికి రూ.64.76 కోట్ల వరకు ఆదా అయ్యింది.

అప్పుడు ఎన్జీటీతో..ఇప్పుడు విజిలెన్స్‌తో

మూడు రిజర్వాయర్ల నిర్మాణ పనులు మొదలయ్యాక టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టించడం మొదలు పెట్టారు. ఎన్జీటీలో కేసు వేసి పనులు నిలిపివేయించారు. 2023 ఆగస్టు 4న ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగళ్లుకు వచ్చిన చంద్రబాబుకు విన తిపత్రం ఇవ్వాలని ప్రయత్నించిన వారిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశాయి. ఇప్పుడు అధికారంలోకి రావడంతో విజిలెన్స్‌ విచారణ పేరుతో రిజర్వాయర్లకు సమాధి కట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు. శుక్రవారం మదనపల్లె, తంబళ్లపల్లెల్లో పర్యటించిన జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రిజర్వాయర్లను ఉద్దేశించి చేసిన ఆరోపణలు చేయడంపై రైతులు మండిపడుతున్నారు.

ఆగిపోయిన ఆవులపల్లె రిజర్వాయర్‌ పనులు (ఫైల్‌)

ఘనంగా సంకటహర చతుర్థి

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతర్థి గణపతి వ్రతాన్ని చేపట్టారు. రాత్రి ఆలయ మాడ వీధుల్లో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈవో పెంచలకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటితో రేషన్‌ పంపిణీ ఆఖరు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో రేషన్‌ పంపిణీ శనివారంతో ముగియనుందని డీఎస్‌ఓ శంకరన్‌ తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో రేషన్‌ పంపిణీ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 88శాతం పంపిణీ పూర్తియిందన్నారు. మిగిలిన కార్డుదారులు సాయంత్రంలోపు రేషన్‌ తీసుకోవాలని ఆయన సూచించారు.

బాధ్యతగా పనిచేయాలి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ బాధ్యతగా పనిచేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె శిశు మరణాల టాస్క్‌ఫోర్స్‌ కమి టీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడాది లోపు చనిపోయే పిల్లలు కూడా శిశు మరణాల కిందకే వస్తారన్నారు. గత నెల రోజుల వ్యవధిలో 8 శిశుమరణాల సంభవించాయని చెప్పారు. ఇవన్నీ కూడా ఆస్పత్రుల్లోనే నమోదైనట్టు పేర్కొన్నారు. డీఐఓ హనుమంతరావు, అధికారులు లత, అనిల్‌కుమార్‌, సింధూర, వెంకటేశ్వరి, మోహన్‌బాబు, ఉషశ్రీ, అనూష పాల్గొన్నారు.

సబ్సిడీ రుణాలు ఇవ్వాలి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): గొర్రెల పెంపకందారులకు ఉచితంగా రుణాలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా గొర్రెల పెంపకందారుల సొసైటీ అధ్యక్షుడు గంగరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సహకార జిల్లా యూనియన్‌ కార్యాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర గొర్రెల పెంపకందారుల సొసైటీ అధ్యడి ఆధ్వర్యంలో జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ అధ్యక్షులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యాభై ఏళ్లు నిండిన వారికి పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

గంగాధర నెల్లూరు : మండలంలోని వింజం పంచాయతీ వీఆర్వో ప్రవీణ్‌కుమార్‌ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వైఖరి పట్ల స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట ఎంపీటీసీ హనీఫ్‌ బాషా, గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు శుక్రవారం నిరసనకు దిగారు. వీఆర్వో గ్రామంలోని రైతులు, విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదని, ఫోన్‌ చేస్తే కనీసం స్పందించడం లేదని, సర్టిఫికెట్ల కోసం 20 రోజులుగా విద్యార్థులు కార్యాలయాల చుట్టూ చక్కెర్లు కొడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోగా.. వారి ముందే గ్రామస్తులపై వీఆర్వో చిందులేశారు. ‘నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. ఏ అధికారి ఏమీ చేయలేడు.. నాకు రాజకీయ అండదండలున్నాయి.. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ చెలరేగిపోయాడు. వైఎస్సార్‌సీపీ నాయకుడు యువరాజు మాట్లాడుతూ వీఆర్వో ప్రవీణ్‌ కుమార్‌ వైఖరి వివాదాస్పదంగా ఉందని, ధనికలు, కూటమి నాయకుల సేవలోనే తరిస్తున్నాడని తెలిపారు. అదే పేద, మధ్యతరగతి రైతులకు సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు. జిల్లా అధికారులు స్పందించి సదరు వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యూస్‌రీల్‌

రూ.2,144 కోట్లతో ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ల నిర్మాణం

హంద్రీ–నీవా ప్రాజెక్టులోనే ఆవులపల్లె అతిపెద్ద రిజర్వాయర్‌

టీడీపీకి మనుగడ ఉండదన్న కక్షతో ఎన్జీటీలో కేసు

అర్ధంతరంగా ఆగిపోయిన రిజర్వాయర్ల పనులు

పనులు చేసినా రూ.800 కోట్ల బిల్లులు పెండింగ్‌

ఇప్పుడు విజిలెన్స్‌ విచారణ పేరుతో కొత్త నాటకం

1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం తప్పా?

నన్ను ఎవరూ ఏమీ చేయలేరు

రెవెన్యూ అధికారుల ముందే సవాల్‌ విసిరిన వీఆర్వో

సచివాలయం ముందు గ్రామస్తుల నిరసన

కరువును పారద్రోలి..బీడు భూములు సస్యశ్యామలం చేయాలన్న సంకల్పానికి టీడీపీ నేతలు గండికొట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మంజూరైన ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ల నిర్మాణ పనులను అడ్డుకుని కేసులు వేశారు. ఇది చాలదన్నట్టు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వేధింపులకు దిగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విజిలెన్స్‌ విచారణ పేరుతో కొత్త నాటకానికి తెరదీశారు. రాయలసీమలోనే పెద్దాయనగా పేరుగడించిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్షగట్టి ప్రాజెక్టులకు శిక్ష వేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అవిరాళ కృషిని నీరుగార్చారు. దీనిపై రైతులు రగిలిపోతున్నారు.

రూ.800 కోట్లు పెండింగ్‌

ఈ మూడు రిజర్వాయర్లకు సంబంధించి పనులు నిలిపివేసిన 2023 మే 11 నాటికి ముదివేడు రిజర్వాయర్‌ 33 శాతం, నేతికుంటపల్లె 86 శాతం, ఆవులపల్లె 5.8 శాతం పనులు జరిగాయి. మొత్తం టెండర్‌ వ్యయంలో జరిగిన పని విలువ రూ.800 కోట్లకు పైనే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చెల్లించింది రూ.30 కోట్లని సమాచారం. చేసిన పనులకు ప్రస్తుత ప్రభుత్వం రూ.800 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే రిజర్వాయర్లకు శాశ్వత సమాధి కట్టడం కోసం కూటమి ప్రభుత్వం పైద్దాయనపై కక్షతో కరువు రైతాంగానికి శిక్ష విధిస్తోంది.

సాగునీరు అందించడం తప్పా

మూడు రిజర్వాయర్ల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న మహత్తర లక్ష్యం తప్పా అని రైతాంగం ప్రశ్నిస్తోంది. సాగునీటి రంగంలో దశాబ్దాలుగా వెనుకబడిన తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో రైతాంగ సంక్షేమానికి పెద్దాయన పెద్దపీట వేయడం నేరమా అని నిలదీస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దాయనను ఎదుర్కొనే వ్యూహం లేని టీడీపీ ఆయన చేపట్టిన అభివృద్ధిపై ఇలా అక్కసు వెళ్లగక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ఈ రిజర్వాయర్ల పరిస్థితిపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పాటికే పూర్తి కావాల్సిన పనులను అడ్డుకుని నిలిపివేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి! 1
1/8

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి! 2
2/8

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి! 3
3/8

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి! 4
4/8

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి! 5
5/8

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి! 6
6/8

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి! 7
7/8

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి! 8
8/8

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement