
ప్రభుత్వ భూమి.. అడిగేదెవరు
కార్వేటినగరంలో రూ.ల క్షలు విలువ జేసే ప్రభుత్వ భూమిని కూటమి నేతలు దర్జాగా ఆక్రమిస్తున్నారు.
వన మహోత్సవం
చిత్తూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఎస్వీ అగ్రికల్చర్ విద్యార్థులు వన మహోత్సవాన్ని నిర్వహించారు.
గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటున్న కొందరు ప్రబుద్ధులు డబ్బుకు దాసోహమవుతున్నారు. కాసుల కక్కుర్తికి కడుపులోని ఆడబిడ్డలను కడతేరుస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని చెప్పాల్సిన వైద్యులే ముఠాలుగా ఏర్పడి అక్రమ దందాకు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలకు ఒడిగడుతున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. కడుపులోనే చిదిమేస్తున్నారు.
జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుగా చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి పలు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రి నిర్వాహకులు, వారి సహాయకులు కడుపులో పెరుగుతోంది ఆడబిడ్డా, మగబిడ్డా అనేది ప్రసవానికి ముందే నిర్ధారిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే వెంటనే అబార్షన్లు చేయించడంతో బాలికల సంఖ్య క్రమేణా తక్కువగా ఉంటోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా ఈ ఏడాది కాలంలో 28,584 మంది జన్మిస్తే 15,212 మంది మగపిల్లలు, 13,372 మంది ఆడ పిల్లలు జన్మించారు.
సరిహద్దు ప్రాంతాలు చిత్తూరు వైపు...
జిల్లాలో స్కానింగ్ సెంటర్లు నడుపుతున్న కొందరు తల్లి గర్భంలోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ప్రధానంగా చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం తదితర ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆర్‌ఎంపీలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల సహాయకులు స్కానింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పక్క రాష్ట్రానికి కూడా పాకింది. తమిళనాడు, కర్ణాటక నుంచి వందల సంఖ్యలో గర్భిణులు లింగ నిర్ధారణ కోసం జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఆడ అయితే శుక్రవారం, అమ్మవారి పేర్లు, అమ్మవారి చిత్రపటాలు చూపించడం, డాక్టరమ్మ, మైనస్, వంటి పదాలతో సూచిస్తున్నారు. మగబిడ్డ అయితే సోమవారం, ప్లస్, దేవుడి బొమ్మలు చూపి లింగ నిర్ధారణ విషయాలను బయటపెడుతున్నారు.
ఇష్టారీతిగా అబార్షన్లు
జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో దావాఖానల నిర్వాహకులు ఇష్టారీతిగా అబార్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాహేతర సంబంధాల వల్ల గర్భందాల్చిన మహిళలు, ఇతర కారణాలతో మరికొందరు అబార్షన్లకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గర్భిణులు ఆరోగ్యపరంగా తప్పనిసరి పరిస్థితుల్లో అబార్షన్లు చేయించుకుంటే వైద్యాధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సి ఉండగా, నిబంధనలను పట్టించుకోవడం లేదు. దీనిపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు
ఆడబిడ్డ అయితే కడుపులోనే చిదిమేస్తున్న వైనం
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గర్భిణులు చిత్తూరుకు..
తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పలుమార్లు ఫిర్యాదులు
పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
జిల్లాలో స్కానింగ్ సెంటర్ వివరాలు
మొత్తం స్కానింగ్
సెంటర్లు 78
చిత్తూరు 37
పలమనేరు 22
కుప్పం 14
నగరి 05
జిల్లాలో జననాల సంఖ్య
సంవత్సరం మగపిల్లలు ఆడపిల్లలు
2021-22 15,703 14,182
2022-23 15,061 14,186
2023-24 15,212 13,372
అమ్మగా .. అక్కగా..చెల్లిగా..అర్ధాంగిగా.. అనేక పాత్రల్లో చెయ్యి పట్టి నడిపించే ఆడబిడ్డకు ఆపదొచ్చింది.. ఆడపిల్ల భారమనుకొని కడుపులోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు వైద్యులు , స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో పసి మొగ్గలను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఇందు కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.. డబ్బులు ముట్టజెబితే జిల్లాలోని పలు స్కానింగ్ కేంద్రాల్లో సులువుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి పుట్టబోయేది.. ఆడ..మగ ప్రసవానికి ముందే వెల్లడిస్తుండడంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లింగ నిర్ధారణ పరీక్షలకు జిల్లాకు తరలివస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
నిబంధనలు ఇవీ..
కడుపులో పెరుగుతున్న బిడ్డకు జన్యుపరమైన లోపాల కోసం, శిశువు పెరుగుదల ఎలా ఉందో తెలుసుకునేందుకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. కడుపులోని బిడ్డ ఆడ, మగ ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు. లింగ నిర్ధారణకు సహకరించిన వారికి 3 నెలల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే తప్పు చేసిన వారికి అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. వైద్యులు దోషులుగా తేలితే లైసెన్స్‌ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసి అనుమతి రద్దు చేసే అవకాశం ఉంది. గర్భంలోని శిశువుకు లింగ నిర్ధారణ చేయమని కోరినా మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టాల్సిన అవసరం ఉంది. కాగా ఈ అక్రమ లింగ నిర్ధారణపై సాక్షిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. చిత్తూరు నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ లింగ నిర్ధారణ కేంద్రాన్ని కలెక్టర్ సుమిత్‌కుమార్ బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని గుట్టును రట్టు చేశారు.
ఆస్పత్రి వివరాలు ఇలా..
జిల్లా ఆస్పత్రి 01
ఏరియా ఆస్పత్రులు 04
సీహెచ్‌సీలు 08
పీహెచ్‌సీలు 50
అర్బన్ హెల్త్ సెంటర్లు 15
ప్రైవేటు ఆస్పత్రులు 1,500
ఆర్‌ఎంపీలు 2,000
లింగ నిర్ధారణ చేస్తే చర్యలు : కలెక్టర్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని అటువంటి పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. బుధవారం చిత్తూరు నగరం లోని 9వ వార్డు భరత్ నగర్ కాలనీ నందు ఒక ప్రైవేటు ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి వచ్చిన వారిని డెకాయిట్ ఆపరేషన్‌లో భాగంగా గుర్తించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు వచ్చిన 9 మందిని గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో గర్భస్థ లింగ నిర్ధారణ చేసే సంబంధిత పరికరాలను, ఇంటిని సీజ్ చేసి కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిసినా కూడా ఇలా చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అవసరాలే ఆసరాగా..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట విరుద్ధ్దమని బోర్డులు ప్రదర్శిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పలువురు అర్‌ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులు, ఆశా కార్యకర్తలు, కొంత మంది వ్యక్తులను నియమించుకొని పలువురు లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దంపతుల అవసరాలను ఆసరాగా చేసుకొని దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరీక్షల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టి రెండు, మూడోసారి గర్భందాల్చిన మహిళలు లింగ నిర్ధారణకు అధికంగా వస్తున్నారు.

ప్రభుత్వ భూమి.. అడిగేదెవరు

ప్రభుత్వ భూమి.. అడిగేదెవరు

ప్రభుత్వ భూమి.. అడిగేదెవరు

ప్రభుత్వ భూమి.. అడిగేదెవరు

ప్రభుత్వ భూమి.. అడిగేదెవరు