
అరటి సాగులో అద్భుతాలు
అరటి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు రామకుప్పం మండలానికి చెందిన యువరైతు జ్ఞానప్రకాష్.
జిల్లాకు ఆరు సబ్‌స్టేషన్ల మంజూరు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాకు ఆరు సబ్‌స్టేషన్లు మంజూరైనట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. చిత్తూరు నగరం, గుడిపాల, యాదమరి, తవణంపల్లె, పెద్దపంజాణి, శాంతిపురం మండలాలకు ఒక్కో సబ్‌స్టేషన్ కేటాయించారన్నారు. ఒక సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.4 కోట్ల మేర మంజూరు చేశారని చెప్పారు. స్థలం ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివే దిక ఇస్తే నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు వివరించారు.
ఆక్రమణలపై తనిఖీలు
కుప్పం: మండలంలోని కుంజేగానూరు గ్రామ రెవెన్యూకు సంబంధించి గుట్ట పోరంబోకు కబ్జాపై ‘సాక్షి’లో ‘కుంజేగానూరులో భూచోరులు’ శీర్షికన ఆదివారం వార్త వెలువడింది. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆక్రమణలకు గురైన గుట్టపోరంబోకును సోమవారం పరిశీలించారు. డీకేటీ పట్టా ఉన్నా క్రయవిక్రయాలు చేయరాదన్నారు. ఓ రైతు పొలానికి ఆనుకుని ఉన్న మిట్ట పోరంబోకులో ఎవరికీ అనుమతులు లేవని, అది పశువుల మేత బీడుగా రికార్డుల్లో ఉందన్నారు. అక్కడ కట్టడాలు కట్టి కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
– 8లో

అరటి సాగులో అద్భుతాలు