
గోసంరక్షణ ట్రస్టుకు విరాళాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని గోసంరక్షణ ట్రస్టు కు ఇద్దరు దాతలు శనివారం రూ.లక్ష వంతు న విరాళాలు ఇచ్చారు. గుంటూరుకు జిల్లాకు చెందిన సూరిశెట్టి రమేష్ రూ.లక్ష నగదును ఆలయాధికారులకు అందజేశారు. ఆలయాధికారులు దాతకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే చైన్నెకు చెందిన దాత కలవకుంట ప్రత్యోత్ రూ.లక్ష నగదు ఆలయాధికారులకు అందజేశారు. ఆలయ సిబ్బంది కోదండపాణి దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
పెళ్లి పేరుతో వంచన
పుంగనూరు: పట్టణానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసగించిన యువకుడిపై ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామసముద్రం మండలం చింపరపల్లెకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అదే మండలంలోని ఓ యువతి తండ్రితో ఆర్థిక లావాదేవిలు అడ్డు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పు ఇచ్చి ఇల్లు రాసుకున్నాడు. ఇలా మోసం చేస్తూ నిలదీసినందుకు యువతిని ప్రేమ పేరుతో మోసగించి, గర్భవతిని చేశాడని ఆమె పోలీసులకు కిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.